Tollywood: ‘ఒక్కడున్నాడు’ హీరోయిన్ గుర్తుందా.? ఏం చేస్తుందో.! ఇప్పుడెలా ఉందో చూస్తే బిత్తరపోతారు..
గోపీచంద్ హీరోగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం 'ఒక్కడున్నాడు'. అప్పట్లో ఈ మూవీ..
గోపీచంద్ హీరోగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం ‘ఒక్కడున్నాడు’. అప్పట్లో ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. ప్రయోగాత్మక చిత్రంగా పేరు తెచ్చుకుంది. బాంబే బ్లడ్ గ్రూప్ అనే రేర్ బ్లడ్ గ్రూప్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. ఈ మూవీ గోపీచంద్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుంది.
ఇందులో హీరోయిన్‌గా నటించిన నేహ జుల్కా గుర్తుందా.? ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ.. ఈ సినిమాతోనే తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ‘ఒక్కడున్నాడు’ తర్వాత ఈ అందాల భామకు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే కేవలం రెండు చిత్రాలతోనే టాలీవుడ్‌కు దూరమైంది.
తెలుగుతో పాటు హిందీ భాషలో కలిపి నేహ జుల్కా నటించింది కేవలం మూడు సినిమాలే. అటు వెండితెర.. ఇటు బుల్లితెరలోనూ పలు సీరియల్స్‌లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నేహ జుల్కా. ఇక ప్రస్తుతం ఈ భామ ఏం చేస్తుందో..? ఎలా ఉందో తెలుసుకునేందుకు చాలామంది నెటిజన్లు ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు. 40వ ఒడిలోకి వస్తున్నా.. ఈ బ్యూటీ ఇంకా సింగిల్‌గానే ఉంది. ప్రస్తుతం నేహ జుల్కా.. అటు పలు యాడ్స్‌లో.. ఇటు వెబ్ సిరీస్‌ల్లో తన నటనను కొనసాగిస్తోంది. కాగా, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
View this post on Instagram
View this post on Instagram