‘అవును.. తల్లి’ని కాబోతున్నాను : సమంత

సమంత ప్రెగ్నెంటా?  సమంత బేబీని ప్లాన్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రోజుకొకటి వస్తుండటంతో విసుగు చెందింది ఈ రంగస్థలం బ్యూటీ.. రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడుతూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చింది. అందులో భాగంగా ఓ నెటిజన్ సమంతను మీరెప్పుడు తల్లి కాబోతున్నారని ప్రశ్నించాడు. దీనికి చిరుకోపంగా, అంతే వ్యంగ్యంగా సమాదానం ఇస్తూ.. 2022 సంవత్సరంలో ఆగస్టు 7వ తారీఖున ఉదయం 7 గంటలకు ఓ […]

'అవును.. తల్లి'ని కాబోతున్నాను : సమంత

సమంత ప్రెగ్నెంటా?  సమంత బేబీని ప్లాన్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రోజుకొకటి వస్తుండటంతో విసుగు చెందింది ఈ రంగస్థలం బ్యూటీ.. రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడుతూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చింది. అందులో భాగంగా ఓ నెటిజన్ సమంతను మీరెప్పుడు తల్లి కాబోతున్నారని ప్రశ్నించాడు. దీనికి చిరుకోపంగా, అంతే వ్యంగ్యంగా సమాదానం ఇస్తూ.. 2022 సంవత్సరంలో ఆగస్టు 7వ తారీఖున ఉదయం 7 గంటలకు ఓ బిడ్డకు జన్మనిస్తానని చెప్పింది.

సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ హిట్ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.