మళ్ళీ వెజిటేరియన్ గా మారిన ‘ అభినవ సీతమ్మ ‘ !

సినిమా పాత్రను పాత్రలా కాకుండా మనసు పెట్టి చేసే నటీనటులు చాలా మందే ఉంటారు..వీరంతా ఆయా పాత్రల్లో లీనమై తమని తాము మర్చిపోయే సంఘటనలు కూడా చాలానే ఉంటాయి.. మరి, ఇలాంటి యాక్టర్స్ కి సాక్ష్యాత్తు దేవుళ్ల పాత్రలు పోషించే అవకాశం వస్తే ఎంత డెడికేషన్‌తో ఉంటారో చెప్పనవసరం లేదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ కోవకే చెందుతుంది. అప్పట్లో శ్రీరామరాజ్యం సినిమాలో సీతమ్మ పాత్ర పోషించేప్పుడు నయన్ పూర్తిగా శాఖాహారిగా మారింది. ఇప్పుడు […]

మళ్ళీ వెజిటేరియన్ గా మారిన ' అభినవ సీతమ్మ ' !
Follow us

|

Updated on: Nov 20, 2019 | 8:46 PM

సినిమా పాత్రను పాత్రలా కాకుండా మనసు పెట్టి చేసే నటీనటులు చాలా మందే ఉంటారు..వీరంతా ఆయా పాత్రల్లో లీనమై తమని తాము మర్చిపోయే సంఘటనలు కూడా చాలానే ఉంటాయి.. మరి, ఇలాంటి యాక్టర్స్ కి సాక్ష్యాత్తు దేవుళ్ల పాత్రలు పోషించే అవకాశం వస్తే ఎంత డెడికేషన్‌తో ఉంటారో చెప్పనవసరం లేదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ కోవకే చెందుతుంది. అప్పట్లో శ్రీరామరాజ్యం సినిమాలో సీతమ్మ పాత్ర పోషించేప్పుడు నయన్ పూర్తిగా శాఖాహారిగా మారింది. ఇప్పుడు మళ్లీ ‘మూకుత్తి అమ్మన్’ అనే తమిళ సినిమా కోసం నయన్ మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట . గతంలో అన్నమయ్య, నమో వేంకటేశాయ లాంటి సినిమాల్లో నటించేప్పుడు హీరో నాగార్జునతో సహా చిత్ర యూనిట్ మొత్తం పాదరక్షలు వాడలేదట. ప్రస్తుతం నయన్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుని వార్తల్లో నిలిచింది. మాంసాహారానికి దూరంగా ఉండటమే కాకుండా.. ఒక పూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సినిమా యూనిట్ చెబుతున్నారు.. ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా హిందూ దేవత పాత్రను ఇంత నిష్టతో పోషిస్తున్న నయన్ డెడికేషన్‌ను  అందరూ మెచ్చుకుంటున్నారు.