హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా?

మెగాస్టార్-మణిశర్మల జోడీ మళ్లీ తెరపైన మ్యాజిక్ చేయబోతోందా? అవుననే అంటున్నాయి సినీవర్గాలు. కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి చేసే 152వ సినిమాకు మణిశర్మను మ్యూజిక్ డైరక్టర్ గా ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. బావగారూ బాగున్నారా..అన్నయ్య..చూడాలని వుంది..ఇంద్ర ఇలా ఎన్నో హిట్ లు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి బాక్సాఫిస్ వల్ల బ్లాక్ బస్టర్లుగా, మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మొన్నటిదాకా పెద్దగా సినిమాలు లేకున్నా.. ఈ మధ్య వచ్చిన ఇస్మార్ట్ […]

హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా?

మెగాస్టార్-మణిశర్మల జోడీ మళ్లీ తెరపైన మ్యాజిక్ చేయబోతోందా? అవుననే అంటున్నాయి సినీవర్గాలు. కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి చేసే 152వ సినిమాకు మణిశర్మను మ్యూజిక్ డైరక్టర్ గా ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. బావగారూ బాగున్నారా..అన్నయ్య..చూడాలని వుంది..ఇంద్ర ఇలా ఎన్నో హిట్ లు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి బాక్సాఫిస్ వల్ల బ్లాక్ బస్టర్లుగా, మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మొన్నటిదాకా పెద్దగా సినిమాలు లేకున్నా.. ఈ మధ్య వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫాంలోకి వచ్చారు మెలడీ బ్రహ్మ మణిశర్మ. పైగా టాలీవుడ్ ను సంగీత దర్శకుల కొరత పట్టి పీడిస్తోండటంతో మణిశర్మకు ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఈ సినిమాకు ముందుగా బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్లు అజయ్-అతుల్ లను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆఖరికి మణిశర్మనే ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌ లో ఎలాంటి మ్యూజిక్ రాబోతుందో అన్న విషయం తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.