‘రూలర్’ సినిమాకి హీరోయిన్‌ హ్యాండ్.. ‘టైం’కి రిలీజ్‌ అవుతుందా..?

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆయన ఎంచుకున్న ప్రతీ సినిమాలో.. మాస్.. ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా.. కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో వస్తోన్న బాలయ్య సినిమా ‘రూలర్’ కూడా.. మాస్ ఎలిమెంట్‌లో తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అందులోనూ.. ఈ సినిమాలో.. బాలయ్య పాత్ర చాలా ఆసక్తిగా ఉంది. ముందు చాలా స్లిమ్‌గా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించిన బాలయ్య.. ఆ తరువాత.. […]

'రూలర్' సినిమాకి హీరోయిన్‌ హ్యాండ్.. 'టైం'కి రిలీజ్‌ అవుతుందా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 20, 2019 | 6:01 PM

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆయన ఎంచుకున్న ప్రతీ సినిమాలో.. మాస్.. ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా.. కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో వస్తోన్న బాలయ్య సినిమా ‘రూలర్’ కూడా.. మాస్ ఎలిమెంట్‌లో తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అందులోనూ.. ఈ సినిమాలో.. బాలయ్య పాత్ర చాలా ఆసక్తిగా ఉంది. ముందు చాలా స్లిమ్‌గా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించిన బాలయ్య.. ఆ తరువాత.. పోలీస్ పాత్రలో కనిపించి.. అభిమానులను అలరించారు. కాగా.. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 20కి రిలీజ్ చేస్తారని మొదట అందరూ భావించినా.. వాయిదా వేసి.. డిసెంబర్ 28కి రిలీజ్‌ చేయాలని పకడ్బందీగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. అయితే… ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో.. ఒక హీరోయిన్‌గా నటిస్తోన్న.. సోనాల్ చౌహాన్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. చిత్ర యూనిట్‌తో వచ్చిన విభేదాలతో.. ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. మరోవైపు ఈ సినిమాని చిత్ర బృందం..  ఖచ్చితంగా టైంకి రిలీజ్ చేయాలనుకుంటోంది. ఈ సమయంలో.. సోనాల్.. సినిమాకు హ్యాండ్ ఇవ్వడం కాస్త ఆలోచించాల్సిన విషయమే.

పోనీ.. సోనాల్ స్థానంలో.. మరో హీరోయిన్‌ని తీసుకుని.. ఇప్పటికప్పుడు.. మళ్లీ రీ షూటింగ్ చేసి.. ఎడిట్ చేయాలన్నా.. చాలా సమయం పడుతుంది. డిసెంబర్ 28కి ఖచ్చితంగా.. దాదాపు  నెల రోజులకి పైగానే సమయం ఉంది. ఈ టైంలో.. రూలర్ సినిమాని పూర్తి చేయగలరా..? అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరోవైపు.. ఇక ఈ రూమర్స్‌పై ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ స్పందించారు. ఇది కేవలం రూమర్‌ మాత్రమే అని.. సోనాల్ చౌహాన్ షూటింగ్‌లో ఉందని.. డిసెంబర్ 28 కన్నా ముందే.. అంటే డిసెంబర్ 20నే ఖచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని.. ఆయన తెలిపారు.