AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే భారత పౌరసత్వం రద్దు

టిఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర హోం శాఖ విచారణలో చుక్కెదురైంది. డ్యూయల్ సిటిజెన్‌షిప్ కలిగి వున్న చెన్నమనేని మన దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ ఆయనపై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గతంలోనే రమేశ్‌ భారత పౌరసత్వం చెల్లదని తీర్పునిచ్చింది. దానిపై రివ్యూకు వెళ్ళిన రమేశ్ కేసును కేంద్ర హోం శాఖ సుదీర్ఘ కాలం పరిశీలించింది. […]

బిగ్ బ్రేకింగ్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే భారత పౌరసత్వం రద్దు
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 21, 2019 | 4:43 PM

Share

టిఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర హోం శాఖ విచారణలో చుక్కెదురైంది. డ్యూయల్ సిటిజెన్‌షిప్ కలిగి వున్న చెన్నమనేని మన దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ ఆయనపై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గతంలోనే రమేశ్‌ భారత పౌరసత్వం చెల్లదని తీర్పునిచ్చింది. దానిపై రివ్యూకు వెళ్ళిన రమేశ్ కేసును కేంద్ర హోం శాఖ సుదీర్ఘ కాలం పరిశీలించింది. బుధవారం కేంద్ర హోం శాఖ తన నిర్ణయాన్ని వెల్లడించింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది.

జర్మనీలో సెటిలైన చెన్నమనేని రమేశ్.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తప్పుడు పత్రాలతో భారత దేశ పౌరసత్వం పొందాడన్నది ఆయనపై ప్రధానమైన ఆరోపణ. 1955 భారత పౌరసత్వ చట్టం ప్రకారం విదేశాల్లో సెటిలైన భారతీయులు తిరిగి మనదేశ పౌరసత్వం పొందాలంటే ఇక్కడ కనీసం ఒక సంవత్సరం పాటు నివాసం వున్నట్లుగా ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి వుంటుంది. అయితే.. 2009 ఎన్నికలకు ముందు కేవలం 96 రోజులు మాత్రమే మనదేశంలో వున్న చెన్నమనేని రమేశ్.. ఒక సంవత్సరం పాటు ఇక్కడ వున్నట్లు తప్పుడు పత్రాలు సమర్పించారు.

ఈ పత్రాలను, రమేశ్ భారతీయ పౌరసత్వాన్ని వేములవాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆది శ్రీనివాస్ అప్పట్లోనే సవాల్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని హైకోర్టు కేసును విచారించి రమేశ్ పౌరసత్వం చెల్లదని తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. 2017 డిసెంబర్ 17న రమేశ్ పౌరసత్వం చెల్లదని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. అయితే.. సుప్రీంకోర్టు తీర్పుపై రమేశ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధిగా తానిక్కడ చేసిన సేవలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు రమేశ్.

రమేశ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కేంద్ర హోం శాఖకు రెఫర్ చేసింది. పత్రాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. దాంతో గత నాలుగు నెలలుగా కేంద్ర హోంశాఖాధికారులు రమేశ్ సమర్పించిన పత్రాలను పున:పరిశీలించారు. బుధవారం కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. రమేశ్ పౌరసత్వం చెల్లదని తేల్చి చెప్పింది. దాంతో రమేశ్ ఎన్నిక కూడా రద్దయ్యే పరిస్థితి తలెత్తింది.

అయితే.. రమేశ్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడైనందున ఇప్పుడు వేములవాడ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారా లేక గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.