Sai Pallavi: రెమ్యునరేషన్ పెంచేసిన సాయి పల్లవి.. ఏకంగా రూ. 50కోట్లు అందుకుంటున్న నేచురల్ బ్యూటీ
ప్రేమమ్ సినిమా తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఫిదా సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మలయాళ ఇండస్ట్రీలో సినిమాతో ప్రేక్షకులను పలకరించింది సాయి పల్లవి. ప్రేమమ్ సినిమా తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఫిదా సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.
బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామాయణం సినిమాతో అక్కడ ప్రేక్షకులను అలరించడడానికి రెడీ అయ్యింది ఈ చిన్నది. స్కిన్ షోకు నో చెప్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్న సాయి పల్లవి మంచి ఆఫర్స్ అందుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది రెమ్యునరేషన్ పెంచేసింది టాక్ వినిపిస్తుంది. తెలుగులో మహానటి సావిత్రి, సౌందర్య తర్వాత ఆ ఇమేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. దాంతో ఈ అమ్మడితో సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
స్టార్ హీరోలు సైతం సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారు. స్టార్ హీరోల క్రేజ్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు రెమ్యునరేషన్ లోనూ స్టార్ హీరోలతో పోటీ పడుతుందని తెలుస్తోంది. లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి తాజాగా రెమ్యునరేషన్ ను పెంచేసిందని తెలుస్తోంది. ఆమె ఇప్పుడు ఓ సినిమాకు ఏకంగా రూ. 50కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీక్ ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కోసం సాయి పల్లవి రూ. 50కోట్ల వరకు అందుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రామాయణం సినిమాను మూడు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు. దాంతో ఆమె డేట్స్ బల్క్ లో కావలి అందుకోసమే ఆమెకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంటున్నారు.
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




