Kalki 2898 AD: కుమ్మేస్తున్న కల్కి.. రిలీజ్‌కు ముందే రికార్డ్స్ తిరగరాస్తున్న సినిమా..
కల్కి సినిమా మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌లలో ఒకటి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. జూన్ 27న కల్కి గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమా మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌లలో ఒకటి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. జూన్ 27న కల్కి గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
‘కల్కి 2898 AD’ ప్రీ-రిలీజ్ థియేటర్ బిజినెస్ దాదాపు 385 కోట్ల రూపాయలు జరిగిందని తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా రీ రేంజ్ బిజినెస్ చేయలేదు. ప్రభాస్ ‘కల్కి 2898 AD’ తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. సీడెడ్ హక్కులు రూ.27 కోట్లకు, నైజాం హక్కులు రూ.70 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ.182 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో పాటు తమిళనాడు, కేరళలో రూ.22 కోట్లకు ఈ సినిమా డీల్ ఫిక్స్ చేసింది. కర్నాటకలో ఈ చిత్రానికి దాదాపు 30 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
అలాగే నార్త్ ఇండియన్ థియేట్రికల్ బిజినెస్ రేషియో రూ.80 కోట్లు కాగా, ఏఏ ఫిల్మ్స్ ద్వారా అడ్వాన్స్ కమీషన్ ప్రాతిపదికన సినిమాను పంపిణీ చేయనున్నారు. ‘కల్కి 2898 AD’ ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 70 కోట్ల రూపాయలు జరిగిందట. ‘కల్కి 2898 AD’ ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రకారం, మేకర్స్ తమ సినిమా నుండి ప్రపంచవ్యాప్తంగా కనీసం 700 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్ల రూపాయలు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
View this post on Instagram
వైజయంతి మూవీస్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




