Sai Durgha Tej: మావయ్యల బాటలోనే మేనల్లుడు.. చిన్నారుల కోసం సాయి దుర్గ తేజ్ భారీ విరాళం.. ప్రశంసల వర్షం

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం 20 లక్షల రూపాయల విరాళం అందించాడు సాయి దుర్గ తేజ్. అలాగే విజయవాడలోని అమ్మ అనాథశ్రమంతో పాటు పలు సేవా సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చాడు. తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడీ మెగా హీరో

Sai Durgha Tej: మావయ్యల బాటలోనే మేనల్లుడు.. చిన్నారుల కోసం సాయి దుర్గ తేజ్ భారీ విరాళం.. ప్రశంసల వర్షం
Sai Durgha Tej
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 29, 2024 | 10:02 PM

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బైక్ యాక్సిడెంట్ కారణంగా చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ క్రేజీ హీరో రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. విరూపాక్షితో వంద కోట్ల సినిమాను ఖాతాలో వేసుకున్న సాయి ఆ తర్వాత పవన్ తో కలిసి బ్రో సినిమాలనూ సందడి చేశాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడీ మెగా హీరో. అదే సమయంలో తన మామయ్యల బాటలో పయనిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం 20 లక్షల రూపాయల విరాళం అందించాడు సాయి దుర్గ తేజ్. అలాగే విజయవాడలోని అమ్మ అనాథశ్రమంతో పాటు పలు సేవా సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చాడు. తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడీ మెగా హీరో. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 29) ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు సాయి దుర్గ తేజ్. తల్లి, సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఈ ప్రోగ్రాంలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడి పిల్లలతో గడిపారు సాయి దుర్గతేజ్ ఫ్యామిలీ. వారితో ముచ్చట్లు చెప్పుకుంటూ అందరూ కలిసి ఫొటోలు దిగారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగానే ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు 5 లక్షల రూపాయలు విరాళం అందించారు సాయి దుర్గ తేజ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు సాయి దుర్గ తేజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మామయ్యల బాటలోనే మేనల్లుడు కూడా’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

చిన్నారులతో సాయి దుర్గ తేజ్ ఫ్యామిలీ..

విజయవాడ అమ్మ అనాథాశ్రమంలో సాయి దుర్గతేజ్.. ఫొటోస్ ఇదిగో..

అవ్వా తాతలతో మాట్లాడుతోన్న మెగా మేనల్లుడు.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.