Sai Dharam Tej: దసరా పండుగ వేళ మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్

దసరా పండగ రోజు మెగా అభిమానులకు ఇది వెరీ గుడ్ న్యూస్. అవును ఈ శభవార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Sai Dharam Tej: దసరా పండుగ వేళ మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్
Sai Dharam Tej

దసరా పండగ రోజు మెగా అభిమానులకు ఇది వెరీ గుడ్ న్యూస్.. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 10న తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి 35 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు తేజ్‌. ఇవాళ అపోలో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. కాగా యాక్సిడెంట్ అనంతరం తొలిసారి అక్టోబర్ 3న ‘రిపబ్లిక్’ సినిమాపై చూపించిన ప్రేమ, అప్యాయతలకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సాయిధరమ్. త్వరలోనే అందర్నీ చూస్తాను అని ఆ రోజున ట్వీట్ చేశాడు సుప్రీం హీరో. ప్రమాదం జరిగిన దాదాపు మూడు వారాల తర్వాత సాయి ధరమ్ తేజ్ తమ అభిమానులను ట్విట్టర్ ద్వారా పలకరించారు.

సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు సుప్రీం హీరో సాయిధరమ్. ఇటీవలే కోలుకున్నారు తేజ్. అయితే, ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి రెగ్యులర్ అప్‌డేట్స్ రాకపోవడంతో.. అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో ఫ్యాన్స్‌లో సందడి నెలకొంది. కాగా సాయి తేజ్ ఆరోగ్యం కోలుకోవాలని కోరుకున్నారు అభిమానులు. కొందరు ఆలయాల్లో కూడా పూజలు చేయించారు. తేజ్ ఆరోగ్యం గురించి కలత చెందవద్దని అప్పట్లో చిరంజీవి చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్‌. కాగా తాజాగా తేజ్ డిశ్చార్జ్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్.

కాగా మరో విశేషం ఏమిటంటే నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులతో పాటు నటీనటులు.. మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Click on your DTH Provider to Add TV9 Telugu