AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది.. ప్రకటించిన చిత్రయూనిట్…డైరెక్టర్ ఎవరంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Ram Charan: రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది.. ప్రకటించిన చిత్రయూనిట్...డైరెక్టర్ ఎవరంటే..
Ramcharan
Rajitha Chanti
|

Updated on: Oct 15, 2021 | 9:50 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రీతోపాటు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇందులో అలీయా భట్.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటుంది. అలాగే చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.. తమిళ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు… ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ అధికారిక ప్రకటనతోపాటు చరణ్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం గౌతమ్.. హిందీలో జెర్సీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఇందులోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. అలాగే చరణ్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.

ట్వీట్…

Also Read : Mahesh Babu: పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్న మహేష్.. క్లారిటీ ఇచ్చిన ప్రిన్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

Actress Poorna : చీరకట్టులో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న హీరోయిన్ పూర్ణ.. లేటెస్ట్ ఫొటోస్‌తో అదరగొడుతున్న బ్యూటీ..

Naveen Chandra: ‘తగ్గేదే లే’ అంటున్న నవీన్ చంద్ర.. ఆసక్తికరంగా టీజర్ విడుదల

Follow Us
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
దీపావళికి ముందే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
నాలుగు ఆవులు.. ముగ్గురు అన్నదమ్ములకు ఎలా పంచాలి..? చిక్కుప్రశ్న
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్బుత స్కీమ్