RRR Movie: ఆర్ఆర్ఆర్లో ‘కొమ్మా ఉయ్యాల’ పాట పాడింది ఎవరో తెలుసా.. ఒరిజినల్ సింగర్ గురించి మీకోసం..
ఆర్ఆర్ఆర్ (RRR) దేశవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలై

ఆర్ఆర్ఆర్ (RRR) దేశవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఇద్దరి నటనకు దేశమంతా ఫిదా అయ్యింది. చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరుల స్నేహబంధాన్ని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు జక్కన్న. ఈ సినిమాలోని నటీనటులపై…సాంకేతిక నిపుణులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మల్లి పాత్ర గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లి పాత్రతో మొదలు కావడం… సినిమా మొత్తం మల్లి అనే పాత్ర పైనే ఆధారపడి ఉంటుంది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభంలోనే మల్లి అనే గిరిజన పాప పాడే కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాలా.. అనే పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ గాత్రానికి శ్రోతలు ముగ్దులయ్యారు. ఆ లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేయాలని కోరుతున్నారు. సినీ ప్రియులను ఆకట్టుకున్న ఆ పాట పాడిన బాలగాయని ప్రకృతి రెడ్డి. పన్నెండేళ్ల వయసున్న ప్రకృతి రెడ్డి.. జూలై 21న 2010 కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన ప్రకృతికి చిన్నతనం నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. దీంతో ఆమె తల్లిదండ్రులు సంప్రదాయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఓవైపు చదువుకుంటూనే పలు సంగీత పోటీల్లోనూ పాల్గొంటూ ఎంతోమందిని మెప్పించింది. కన్నడలోనే కాకుండా.. తెలుగు, తమిళం, హిందీలోనూ పాటలు పాడడం నేర్చుకుంది. బుల్లితెరపై వచ్చే పలు రియాల్టీ షోల్లోనూ పాల్గొంది. తెలుగులో ఎస్పీ బాలు, వాణీ జయరామ్, సునీత, ఎస్పీ శైలజ, చంద్రబోస్, కోటి వంటి సంగీత దర్శకులు.. సింగర్స్ ను తన పాటలతో మెప్పించింది ప్రకృతి.
View this post on Instagram
Also Read: Gaalivaana: జీ5లో మరో థ్రిల్లింగ్ వెబ్ సిరిస్.. గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Raviteja: రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ.. టైగర్ నాగేశ్వర్ రావుకు జోడీ ఎవరంటే..
Acid Reflux: తిన్న తర్వాత ఛాతీలో మంటగా ఉంటుందా ?.. ఇలా చేస్తే తొందరగా రిలీఫ్..
Coffee Benefits: కాఫీ తాగడం వల్ల ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే..