అదిరిపోయే న్యూస్..’ఆర్‌ఆర్‌ఆర్’లో మహేశ్, అమితాబ్..!
టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. బాహుబలి సిరీస్‌తో తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలయిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఈ సినిమాకి కథానాయకులుగా ఎన్నకున్నాడు జక్కన్న. దీంతో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. స్వాంతంత్య్రానికి ముందు పరిస్థితులను కళ్లకు కట్టేలా రూపొందుతోన్న ఈ మూవీలో.. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం […]
టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. బాహుబలి సిరీస్‌తో తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలయిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఈ సినిమాకి కథానాయకులుగా ఎన్నకున్నాడు జక్కన్న. దీంతో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. స్వాంతంత్య్రానికి ముందు పరిస్థితులను కళ్లకు కట్టేలా రూపొందుతోన్న ఈ మూవీలో.. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్‌లో సర్కులేట్ అవుతోంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, బిగ్ బి అమితాబ్‌బచ్చన్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీంతో చేతులు కలపబోతున్నారు. అయితే వీరు సినిమాలో కనిపించరు..జస్ట్ వినిపించబోతున్నారు అంతే. తెలుగు వెర్షన్‌కు మహేశ్, హిందీ వెర్షన్‌కు వాయిస్ ఓవర్లు ఇవ్వబోతున్నారనే టాక్ నడుస్తోంది. తమిళం, మలయాళ వెర్షన్లకు కూడా అగ్రహీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారట. దీనిపై అఫిషియస్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియాభట్, ఎన్టీఆర్ పక్కన ఒలివియా ఆడిపాడతున్నారు. ఈ మూవీ ఈ ఏడాది జులై 30 న విడుదల కాబోతుంది.