ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చిన రాములమ్మ.. కారణమేంటి..!

లేడి అమితాబ్ విజయశాంతి ఫ్యాన్స్‌కు మళ్లీ షాకిచ్చారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరుతో సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. రెండు, మూడు సినిమాల్లో కూడా నటించకుండానే మూవీలకు ఇప్పటికి ఇక సెలవు అంటూ వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది విజయశాంతి. ‘‘సరిలేరు నీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా […]

ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చిన రాములమ్మ.. కారణమేంటి..!

లేడి అమితాబ్ విజయశాంతి ఫ్యాన్స్‌కు మళ్లీ షాకిచ్చారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరుతో సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. రెండు, మూడు సినిమాల్లో కూడా నటించకుండానే మూవీలకు ఇప్పటికి ఇక సెలవు అంటూ వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది విజయశాంతి.

‘‘సరిలేరు నీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుంచి నేటి 2020 సరిలేరు నీకెవ్వరు వరకు ఆ గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.

అయితే సరిలేరు నీకెవ్వరులో భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి నటించారు. ఆమె పాత్ర సినిమా ప్లస్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఆ పాత్రకు విమర్శకుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టినట్లు ఆ మధ్యన ఫిలింనగర్‌లో వార్తలు వినిపించాయి. అంతేకాదు అనిల్ రావిపూడి తదుపరి చిత్రంలోనూ విజయశాంతి కనిపించబోతున్నట్లు గాసిప్‌లు వచ్చాయి. అంతేకాదు చిరు 152లోనూ రాములమ్మ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వచ్చింది. దీంతో ఆమె అభిమానులు సంతోషపడ్డారు. కానీ వీటన్నింటికి చెక్ పెడుతూ సినిమాలకు మళ్లీ బ్రేక్ చెప్పింది రాములమ్మ. అయితే రాజకీయాల్లో కొనసాగాలని బలంగా నిర్ణయించుకోవడం వల్లనే విజయశాంతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మరి అసలు ఈ లేడి అమితాబ్ మనసులో ఏముంది..? రాములమ్మను ఎవ్వరూ మెప్పించలేకపోయారా..? విజయశాంతి ఇకపై సినిమాల్లో నటించదా..? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Published On - 12:34 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu