అతడే కావాలనుకుంటోన్న హరీష్.. పవన్‌ను ఒప్పించాడా..!
పింక్ రీమేక్‌తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ మూవీతో పాటు మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో 27వ చిత్రంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో 28వ మూవీలో నటించబోతున్నారు పవన్ కల్యాణ్. దీంతో ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకాలు సిద్ధంగా ఉండగా.. మరో రెండు చిత్రాలకు కూడా పవన్ ఓకే చెప్పినట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే […]
పింక్ రీమేక్‌తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ మూవీతో పాటు మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో 27వ చిత్రంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో 28వ మూవీలో నటించబోతున్నారు పవన్ కల్యాణ్. దీంతో ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకాలు సిద్ధంగా ఉండగా.. మరో రెండు చిత్రాలకు కూడా పవన్ ఓకే చెప్పినట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పవన్‌తో తాను తీయబోయే చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఈ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఈ మూవీ కోసం సంగీత దర్శకుడిగా తన ఫేవరెట్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను హరీష్ ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్‌ను అతడు ఒప్పించినట్లు సమాచారం.
అయితే పవర్ స్టార్ నటించిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాలకు దేవీ శ్రీనే సంగీతం అందించారు. ఈ ఆల్బమ్‌లు అన్నీ మంచి విజయాలను సాధించగా.. ఈ కాంబోకు ఫ్యాన్స్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా హరీష్, పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్‌సింగ్‌కు దేవీ మ్యూజిక్ పెద్ద ప్లస్ అని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కానీ సర్ధార్ గబ్బర్‌సింగ్ సినిమా విషయంలో దేవీకి, పవన్‌కు మధ్య గ్యాప్ వచ్చినట్లు ఆ మధ్యన వార్తలు వినిపించాయి. అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను నటించిన అఙ్ఞ్యాతవాసి చిత్రానికి దేవీని దూరం పెట్టినట్లు అప్పట్లో గాసిప్‌లు గుప్పుమన్నాయి. అంతేకాదు పవన్ కోరిక మేరకే త్రివిక్రమ్ కూడా దేవీని దూరం చేసుకున్నట్లు ఫిలింనగర్‌లో బలంగా టాక్ నడిచింది. ఇక ఆ తరువాత పవన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో.. ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా కష్టమేనని అందరూ అనుకున్నారు.
కానీ పవన్ రీ ఎంట్రీ ఇవ్వడం.. వరుసగా సినిమాలను ఒప్పుకోవడంతో పవన్-దేవీ కాంబోపై ఫ్యాన్స్‌లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇక హరీష్‌కు కూడా దేవీ ఫేవరెట్ కావడంతో అతడినే పవన్ 28వ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అతడు పవన్‌ను ఒప్పించినట్లు కూడా టాక్. అంతేకాదు అటు మైత్రీ మూవీ మేకర్స్‌కు కూడా దేవీ శ్రీతో మంచి అనుబంధం ఉంది. ఆ నిర్మాణ సంస్థకు ఇప్పటికే నాలుగు హిట్‌లను ఇచ్చారు రాక్‌స్టార్. ఈ నేపథ్యంలో పవన్ 28వ చిత్రానికి దేవీ కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఇదిలా ఉంటే పవన్ 28వ సినిమాపై హరీష్ శంకర్ వేసిన ట్వీట్‌కు స్పందించిన దేవీ.. కెవ్వు కేక అంటూ సమాధానం ఇవ్వగా.. గబ్బర్ సింగ్ ట్రై కాంబో కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ రీ ట్వీట్లు చేస్తున్నారు.
KEVVVVVV KEKAAAAAAA ??????????????????? https://t.co/nPNGW4Rm7h
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 1, 2020