తమిళ స్టార్ హీరో సరసన రష్మిక..! మీకు అర్థమవుతోందా..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రజంట్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. వరస సినిమాలతో దూసుకుపోతోంది.  ‘గీతా గోవిందం’ ఈ యంగ్ బ్యూటీకి ఊహించని సక్సెస్ ఇచ్చింది. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది. ప్రస్తుతం తనను టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు వెంకీ కుడుముల నితిన్‌తో చేస్తోన్న ‘భీష్మ’ మూవీలో ఆడిపాడుతోంది. ఇక సదరన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రంలో కూడా రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్ నగర్ […]

తమిళ స్టార్ హీరో సరసన రష్మిక..! మీకు అర్థమవుతోందా..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రజంట్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. వరస సినిమాలతో దూసుకుపోతోంది.  ‘గీతా గోవిందం’ ఈ యంగ్ బ్యూటీకి ఊహించని సక్సెస్ ఇచ్చింది. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది. ప్రస్తుతం తనను టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు వెంకీ కుడుముల నితిన్‌తో చేస్తోన్న ‘భీష్మ’ మూవీలో ఆడిపాడుతోంది. ఇక సదరన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రంలో కూడా రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. తెలుగులో ఈ రేంజ్‌లో సినిమాలు చేస్తోన్నా కూడా తమిళ్‌వైపు తొంగి చూస్తోంది రష్మిక. అందుకు కారణం కూడా ఉంది.

తమిళ స్టార్ హీరో సూర్య ప్రజంట్ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరరై పోట్రు’ మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీ తర్వాత ‘సింగం’సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వంలో సూర్య నటించనున్నాడు. ఈ కాంబోలో ‘మాస్టర్‌’ ఫేమ్‌ మాళవిక హిరోయిన్‌గా సెలక్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె ప్లేసులోకి రష్మిక చేరినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే సూర్య తమ్ముడు కార్తీ నటిస్తోన్న ‘సుల్తాన్’ మూవీలో నటిస్తోన్న ఈ అమ్మడు..త్వరలో ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

Published On - 8:46 am, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu