AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: వామ్మో ప్రయాణికుల కోసం ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!

Festival Special Trains: ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. పూజా పండగ, 79వ వార్షిక నిరన్‌కారి సంతో సమాగమ్ - 2026 రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాలలో..

Special Trains: వామ్మో ప్రయాణికుల కోసం ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
Festival Special Trains
Subhash Goud
|

Updated on: Oct 14, 2026 | 6:32 PM

Share

Festival Special Trains: దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. పండగ సీజన్‌ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బోలెడు రైళ్లను నడుపుతోంది. పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. పూజా పండగ, 79వ వార్షిక నిరన్‌కారి సంతో సమాగమ్ – 2026 రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాలలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే రోజురోజుకు చాలా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. ఇప్పుడు మరి కొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

1. చర్లపల్లి – విశాఖపట్నం – చర్లపల్లి స్పెషల్ ట్రైన్స్:

  • రైలు నెం. 07067 (చర్లపల్లి నుండి విశాఖపట్నం): ఈ రైలు అక్టోబర్ 15, 2026 న రాత్రి 21:00 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
  • రైలు నెం. 07068 (విశాఖపట్నం నుండి చర్లపల్లి): ఈ రైలు అక్టోబర్ 16, 2026న మధ్యాహ్నం 15:50 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
  • ఆపే స్టాప్‌లు: ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాలలోనూ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లె, దువ్వాడ స్టేషన్‌లలో ఆగుతాయి.
  • బోగీల వివరాలు: ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

2. హెచ్.ఎస్. నాందేడ్ – పానిపట్ – హెచ్.ఎస్. నాందేడ్ స్పెషల్ ట్రైన్స్:

  • రైలు నెం. 07635 (హెచ్.ఎస్. నాందేడ్ నుండి పానిపట్): అక్టోబర్ 21, 27 తేదీలలో ఉదయం 07:40 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 17:30 గంటలకు పానిపట్ చేరుకుంటుంది.
  • రైలు నెం. 07636 (పానిపట్ నుండి హెచ్.ఎస్. నాందేడ్): అక్టోబర్ 22 మరియు 28 తేదీలలో సాయంత్రం 18:15 గంటలకు బయలుదేరి, రెండో రోజు ఉదయం 06:00 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
  • ఆపే స్టాప్‌లు: ఈ రైళ్లు పూర్ణ, పర్భాని, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్, మన్మాడ్, జలగావ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సి, రాణి కమలాపతి, బీనా, వి.ఎల్. ఝాన్సీ, ఆగ్రా కంటోన్మెంట్, మధుర, కోసి కలాన్, న్యూఢిల్లీ మరియు భోధ్వాల్ మజ్రి స్టేషన్‌లలో ఆగుతాయి.
  • బోగీల వివరాలు: ఈ రైళ్లలో 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

ఇది కూడా చదవండి: Indian Railways: కేంద్రం సంచలన నిర్ణయం.. రైల్వే ఉద్యోగులకు పండుగ బోనస్‌..10 లక్షల మందికి బెనిఫిట్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపికబురు.. ఇంటికి అదనంగా రూ.72,000..!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపికబురు.. ఇంటికి అదనంగా రూ.72,000..!
అమ్మ వారికి ఇష్టమైన ఈ ఒక్క నైవేద్యం సమర్పిస్తే కోరిన కోరికలు
అమ్మ వారికి ఇష్టమైన ఈ ఒక్క నైవేద్యం సమర్పిస్తే కోరిన కోరికలు