AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhubala: తస్సాదియ్యా.. ఇంత అందంగా ఉన్నారేంటీ.. ‘రోజా’ మూవీ హీరోయిన్ మధుబాల కూతుర్లను చూశారా..?

రోజా సినిమాతోనే అప్పట్లో యూత్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మధు.. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆఫర్స్ అందుకుంది. దీంతో దక్షిణాదిలో అన్ని భాషలలోనూ మధు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. చిలక్కొట్టుడు, ఆవేశం, గణేష్, అల్లరి ప్రియుడు వటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది

Madhubala: తస్సాదియ్యా.. ఇంత అందంగా ఉన్నారేంటీ.. 'రోజా' మూవీ హీరోయిన్ మధుబాల కూతుర్లను చూశారా..?
Madhubala
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2024 | 4:40 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి హీరోయిన్ మధుబాల. 90వ దశకంలో సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన కథానాయిక. 1991లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన అళగన్ చిత్రంతో సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన మధు.. ఆ తర్వాత రోజా సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ కాగా.. ఇందులో అరవింద్ స్వామి సరసన నటించి మెప్పించింది మధు. అమాయకమైన నటన.. చూపు తిప్పుకోనివ్వని అందమైన రూపంతో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. రోజా సినిమాతోనే అప్పట్లో యూత్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మధు.. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆఫర్స్ అందుకుంది. దీంతో దక్షిణాదిలో అన్ని భాషలలోనూ మధు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. చిలక్కొట్టుడు, ఆవేశం, గణేష్, అల్లరి ప్రియుడు వటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మధు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటి జుహీ చావ్లా బంధువు ఆనంద్ ను వివాహం చేసుకుంది. 1999 ఫిబ్రవరి 19న వీరి పెళ్లి జరిగింది. వీరిద్దరికి అమెయా, కెయా అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మధు.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు సినిమాల్లో యువ హీరోహీరోయిన్లకు తల్లిగా, వదినగా నటిస్తుంది. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది మధు. కొన్ని రోజుల క్రితం ప్రేమదేశం, శాకుంతలం, ఈగల్ చిత్రాల్లో కీలకపాత్రలలో నటించిన మధు.. ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప మూవీలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మధుబాల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఇద్దరు కూతుర్లతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేసింది.

మధుబాల కుమార్తెలు అమెయా, కెయా ఇద్దరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్న మధు.. కుమార్తెల ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అచ్చం హీరోయిన్స్ మాదిరిగానే ఉన్నారని.. తల్లి అందానికి మించి చూడముచ్చటగా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మధు ఇద్దరు కూతుర్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ.. వారిద్దరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.