మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్‌గా హైదరాబాద్ యువతీ
మధ్యప్రదేశ్‌లోని హృదయ నాగరి హర్డా నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిలైన లయన్ మితాలి అగర్వాల్ (కావ్య) 'మిసెస్ ఇండియా 2025 – గ్లోబల్ అంబాసిడర్', 'మిసెస్ ఇండియా కాంజెనియాలిటీ 2025' టైటిల్స్ గెలుచుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జైబాగ్ ప్యాలెస్‌లో డిసెంబర్ 18 నుంచి 22 వరకు జరిగిన ప్రతిష్ఠాత్మక Mrs India పేజెంట్‌లో మితాలి ఈ రెండూ టైటిల్స్ గెలుచుకున్నారు.

హైదరాబాద్, డిసెంబర్ 31: దేశంలో పలు రాష్ట్రాల మహిళలు పాల్గొన్న మిసెస్ ఇండియా 2025 పోటీలో హైదరాబాద్‌కి చెందిన మితాలి అగర్వాల్ (కావ్య) గ్లోబల్ అంబాసడర్‌గా ఎంపిక కావడం విశేషం. ఆమె సేవ, సహృదయతకి గుర్తింపుగా ‘కాంజెనియాలిటీ’ బిరుదు దక్కింది. మధ్యప్రదేశ్‌లో పుట్టి పెరిగిన మితాలి ప్రస్తుతం హైదరాబాద్‌ను తన పని, సేవా కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. ధైర్యం, లక్ష్యబద్ధత, సామాజిక బాధ్యత కలిగిన ఆమెను Conscious లీడర్షిప్‌కు ప్రతీకగా నిలబెట్టింది. ఇంజనీరింగ్ చదివిన ఆమె కమ్యూనికేషన్ లీడర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తరువాత కమ్యూనికేషన్ రంగంలో నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు.
ఆమె స్థాపించిన EcoMiTz ఒక ప్రయోజన కేంద్రిత (purpose-driven) ప్లాట్‌ఫామ్. ఇది వ్యక్తిగత సామాజిక బాధ్యత (Individual Social Responsibility – ISR) భావనపై ఆధారపడి పనిచేస్తోంది. సస్టైనబిలిటీ, గవర్నెన్స్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, మహిళల గౌరవాన్ని కాపాడే పరిష్కారాల వంటి రంగాల్లో ప్రతి ఒక్కరి చిన్న అడుగు – సమాజానికి పెద్ద మార్పు- అనే సిద్ధాంతంతో ఈ ప్లాట్‌ఫామ్ ముందుకు సాగుతోంది. ప్యాడ్‌కేర్‌తో ‘రెడ్ రివల్యూషన్’ Goodwill Mitraగా Padcare సంస్థతో కలిసి Red Revolution కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా menstrual wasteను రీసైకిల్ చేసి మళ్లీ ఉపయోగించగలిగే వనరులుగా మారుస్తూ, పర్యావరణ భారం తగ్గించడం, మహిళలకు గౌరవం, స్వాభిమానం పునరుద్ధరించడాన్ని ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. పీరియడ్స్, వ్యర్థ నిర్వహణ, dignity అనే మూడు కీలక అంశాలను ఈ ఉద్యమం ఒకే ప్లాట్‌ఫామ్‌పై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. మితాలి చేసిన సామాజిక, కమ్యూనికేషన్ సేవలకు గాను ఆమెకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సత్కారాలు లభించాయి. వాటిలో శ్రీ శక్తి 2025, e4m 40 Under 40 గుర్తింపు, అలాగే గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్‌లలో పలు చాణక్య అవార్డులు ఉన్నాయి. ఈ అవార్డులు ఆమె ప్రొఫెషనల్ నైపుణ్యానికే కాదు, సామాజిక బాధ్యత కలిగిన కమ్యూనికేషన్ నాయకురాలిగా ఆమె ఇమేజ్‌కి మరింత బలం చేకూర్చాయి.
తన విజయంలో పునాది తన కుటుంబమని మితాలి అన్నారు. వారి అండ, నమ్మకం, విలువలు ఆమెను ఇంత దూరం తీసుకువచ్చాయని చెబుతున్నారు. PRCI (Public Relations Council of India) ఇచ్చిన Conviction for Communication వల్లనే ఈరోజు తన కమ్యూనికేషన్ ప్రయాణం సార్థకమైందని అన్నారు. తన గత, ప్రస్తుత సంస్థలు తమను రూపొందించాయని ప్రతి రోల్, ప్రతి ప్రాజెక్ట్ తన వ్యక్తిత్వ నిర్మాణానికి సహకరించిందని ఆమె స్పష్టంగా గుర్తు చేసుకున్నారు. Mrs India డైరెక్టర్ Mrs దీపాలి ఫడ్నిస్ భారతీయ మహిళల కోసం ఈ విధమైన శక్తివంతమైన జాతీయ వేదికను సృష్టించారని, Mrs India తెలంగాణ డైరెక్టర్ మమతా త్రివేది తనకు ప్రోత్సాహం, మార్గదర్శకత అందించారని మితాలి అన్నారు.
Mrs India ప్లాట్‌ఫామ్ ద్వారా మితాలి అగర్వాల్ (కావ్య) కేవలం ఒక టైటిల్ హోల్డర్‌గా కాకుండా, మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్‌గా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. “Beauty = Purpose, Purpose = Power” అనే భావనతో, అందం అనేది కేవలం రూపంలో కాదు. మనం సమాజం కోసం చేసే పనిలోని ప్రయోజనంలో ఉందని ఆమె ఇస్తున్న సందేశం. భారత్ అంతటా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి తనకు తోచిన చిన్న ISR చర్యతో మదర్ ఎర్త్‌ను లివింగ్ హెవెన్‌గా మార్చగలడనే విశ్వాసాన్ని ఆమె తన ప్రయాణం ద్వారా ప్రేరణగా నిలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




