Raj Tarun - Lavanya: ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!

Raj Tarun – Lavanya: ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!

Anil kumar poka

|

Updated on: Sep 07, 2024 | 5:05 PM

నటులు రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ మోసం చేశారంటూ నటి లావణ్య కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తాజాగా.. దీనికి సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు.. రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు.

నటులు రాజ్‌తరుణ్‌- లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ మోసం చేశారంటూ నటి లావణ్య కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తాజాగా.. దీనికి సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు.. రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఇక.. లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్‌తరుణ్.

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య చెబుతోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్‌ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్ తరుణ్, లావణ్య పదేళ్ల పాటు సహ జీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు. రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని చార్జిషీట్‌లో తెలిపారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. అయితే ఈ విషయమై ఏబీఎన్‌తో లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం శుభ పరిణామమని తెలిపింది. తనను ఎన్నో మాటలు అన్నారని.. చివరికి న్యాయం గెలుస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొంది. రాజ్ తరుణ్‌కి వ్యతిరేకంగా వెళ్లాలని తనకు లేదని తెలిపింది. తనకు రాజ్ తరుణ్ కావాలని పేర్కొంది. రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మానసికంగా ఎంతో బాధపడ్డానని వెల్లడిచింది. శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి తనపై ఎన్నో నిందలు వేశారని లావణ్య పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.