Kantara Movie : కాంతార థీమ్‌తో దుర్గమాత పూజ.. ఆకట్టుకుంటున్న వీడియో..
విడుదలైన అన్ని భాషల్లో మంచి ఘాన సొంతం చేసుకుంది కాంతారా సినిమా. కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ఎం,మూవీకి వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. త్వరలోనే కాంతార సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంతార2 కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు రిషబ్. కన్నడ ప్రజల సంప్రదాయమైన భూత కోల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కాంతార. కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన కాంతార సినిమా అక్కడ సంచలన విజయం సాధించిన తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో మంచి ఘాన సొంతం చేసుకుంది కాంతారా సినిమా. కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ఎం,మూవీకి వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. త్వరలోనే కాంతార సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంతార2 కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు రిషబ్. కన్నడ ప్రజల సంప్రదాయమైన భూత కోల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కేవలం 16 కోట్లతో తెరకెక్కించగా దాదాపు 450 కోట్ల వరకు వసూల్ చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పటికి కూడా ఈ సినిమాకు సంబంధించిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి.అలాగే మొన్న జరిగిన వినాయక చవితి పంగాలోనూ కాంతార థీమ్‌తో వినాయకుడిని కూడా తాయారు చేశారు. ఇక ఇప్పుడు దసరా సందర్భంగా దుర్గ మాతను కూడా కాంతార థీమ్ తో చేశారు. ఎక్కడంటే. కలకత్తా మహానగరం లో దసరా పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే.
కోల్‌కతాలో కాంతార థీమ్‌లో దుర్గా పూజ నిర్వహించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ పశ్చిమ బెంగాల్‌లో నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద నగరాల్లో అన్ని వీధుల్లో దుర్గాదేవిని నెలకొలిపి పూజలు చేస్తుంటారు. తాజాగా అక్కడి ప్రజలు ‘కాంతారా’ థీమ్‌తో దుర్గాపూజ చేశారు. అమ్మవారి మండపాన్ని కాంతారా థీమ్‌తో అలంకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంతారా థీమ్‌తో దుర్గ దేవికి పూజలు చేయడం ప్రజలను ఆకట్టుకుంది. ఒక సినిమా ప్రభావం ప్రజల పై ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది అంటూ నెటిజన్స్ ఈ వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి