Bigg Boss Telugu 6: 40లక్షలు తీసుకున్న శ్రీహాన్ కంటే రేవంత్‌కే ఎక్కువ ముట్టజెప్పారుగా..!
టాప్ 5లో ఉంటారు అనుకున్న వారు కూడా ఎలిమినేట్ అవ్వడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. ఇక నిన్న జరిగిన ఫినాలే కూడా ట్విస్ట్ లతో ఉత్కంఠను కలిగించింది.
బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. ఊహించినట్టే సింగర్ రేవంత్ విన్నర్ అయ్యాడు. అయితే ఈ సీజన్ లో ఊహించని ట్విస్ట్ లతో ఎలిమినేట్ అవుతూ వచ్చారు. టాప్ 5లో ఉంటారు అనుకున్న వారు కూడా ఎలిమినేట్ అవ్వడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. ఇక నిన్న జరిగిన ఫినాలే కూడా ట్విస్ట్ లతో ఉత్కంఠను కలిగించింది. ఇక టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఒకొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ముందుగా హౌస్ లో మిస్టర్ ఫర్ఫెక్ట్ గా నిలిచిన రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న వారిలో నుంచి ఆదిరెడ్డి అవుట్ అయ్యాడు. ఇక మిగిలిన ముగ్గురిని సూట్ కేస్ తో టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. మాస్ మహారాజా రవితేజ హౌస్ లోకి వచ్చి మరీ మనీతో టెంప్ట్ చేశారు. అంతా కీర్తి ఎమౌంట్ తో బయటకు వస్తుందని అనుకున్నారు. కానీ కీర్తి ఎక్కడ తగ్గకుండా నమ్మకంగా నిలబడింది. ఎక్కడో ఒక మూల విన్నర్ అవుతానన్న నమ్మకం ఉంది. సూట్ కేస్ ఆఫర్ కు నో చెప్పింది.
కానీ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవ్వలి కాబట్టి కీర్తి ఎలిమినేట్ అయ్యింది. కానీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది కీర్తి. ఇక రేవంత్ , శ్రీహాన్ ల మధ్య గట్టి పోటీ జరిగింది. ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అన్నది ఉత్కంఠగా మారింది. కానీ 40లక్షలు మనీ ఆఫర్ చేయడంతో శ్రీహాన్ ఆ మనీ తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. దాంతో విన్నర్ గా రేవంత్ నిలిచాడు.
అయితే శ్రీహాన్ తీసుకున్న 40 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేసి ఇచ్చారు.దాంతో రేవంత్ కు వచ్చింది 10 లక్షలు మాత్రమే. కానీ రేవంత్ కు ఇచ్చిన ప్రైజ్ మనీతో పాటు కారు, ఓ ఇంటి ప్లాట్, ట్రోఫీ ఇచ్చారు. ఇవి కాకుండా ఇన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు వచ్చే రెమ్యునరేషన్ వేరే. దాంతో రేవంత్ కు బాగానే ముట్టజెప్పారు. శ్రీహాన్ కు కూడా బాగానే మనీ వచ్చినప్పటికీ రేవంత్ అంత కాదు. ఇదిలా ఉంటే లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. 40లక్షలు తీసుకున్న తర్వాత శ్రీహాన్ ప్రేక్షకుల ఓటింగ్ లో ముందు ఉన్నాడని అనౌన్స్ చేశారు. ఒకవేళ మనీ తీసుకోకుండా ఉండి ఉంటే శ్రీహాన్ విన్నర్ అయ్యేవాడు. మొత్తంగా రేవంత్ ట్రోఫీ గెలుచుకున్నాడు. శ్రీహాన్ హృదయాలను గెలుచుకున్నాడు. ఇలా బిగ్ బాస్ సీజన్ 6లో ఇద్దరు విన్నర్స్ గా నిలిచారు.