మంచిత‌నంలో అత‌డు ఆకాశం..ఎంతోమందికి అక్ష‌య్ ఆద‌ర్శం

అక్ష‌య్ కుమార్..ఈ పేరు చిర‌స్మ‌ర‌ణీయంగా చ‌రిత్ర‌లో లిఖించ‌బ‌డుతుంది. క‌ష్టం అంటే చాలు వాలిపోతున్నాడు..సాయం అంటే చాలు క‌రిగిపోతున్నాడు. సంద‌ర్భం ఏదైనా అవ‌త‌లి వ్య‌క్తి ఆప‌ద‌లో ఉంటే ఎగ‌బ‌డి వెళ్లిపోతున్నాడు.

మంచిత‌నంలో అత‌డు ఆకాశం..ఎంతోమందికి అక్ష‌య్ ఆద‌ర్శం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 17, 2020 | 4:32 PM

అక్ష‌య్ కుమార్..ఈ పేరు చిర‌స్మ‌ర‌ణీయంగా చ‌రిత్ర‌లో లిఖించ‌బ‌డుతుంది. క‌ష్టం అంటే చాలు వాలిపోతున్నాడు..సాయం అంటే చాలు క‌రిగిపోతున్నాడు. సంద‌ర్భం ఏదైనా అవ‌త‌లి వ్య‌క్తి ఆప‌ద‌లో ఉంటే ఎగ‌బ‌డి వెళ్లిపోతున్నాడు. ఇప్ప‌టికే ఎంతోమందికి సాయం చేసి, భారీ డొనేష‌న్స్ ఇచ్చి ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలిచిన అక్ష‌య్..తాజాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీవీ నటిని ఆదుకున్నాడు. ఆమె ఎదుర్కొంటోన్న ఇబ్బందుల‌ను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అక్షయ్ ఆ ఫ్యామిలీని ఆదుకొని సాయం చేశాడు.

ఈ విషయాన్ని ప్రముఖ టీవీ నటి రేణుకా షాహనే సామాజిక మాధ్యమాల ద్వారా వెల్ల‌డించారు. అక్షయ్‌కు ధ‌న్య‌వాదాలు తెలపుతూ ఆమె ట్వీట్ చేశారు. ప్ర‌ఖ్యాత‌ టీవీ నటి నుపూర్ అంలకర్ ఆర్థిక ఇబ్బందులు స‌త‌మ‌త‌మ‌వుతుంద‌ని షాహానే వరుసగా పోస్టులు చేశారు. పంజాబ్‌, మహరాష్ట్ర బ్యాంక్‌ సంక్షోభం వల్ల ఆమె దాచుకున్న‌ డబ్బు రాకపోవడం, ప్ర‌స్తుతం షూటింగులు జ‌ర‌క్క‌పోవ‌డంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుంద‌ని అలంకర్‌ కుటుంబంపై షమానే పోస్టులు పెట్టారు. ఆమె పోస్టుల చూసి వెంట‌నే రెస్పాండైన అక్ష‌య్..స‌ద‌రు న‌టి కుటుంబానికి సాయం చూసి..మ‌రోసారి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు.