Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: ఎందుకిలా చేస్తున్నారు.. నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..

అలాగే ముందు నుంచి రేణు దేశాయ్ యానిమల్ లవర్. ఎప్పుడూ జంతువులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తారు. అయితే రేణు దేశాయ్ చేసిన ప్రతి పోస్టుకు కొంతమంది నెటిజన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువస్తూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే చాలాసార్లు ఈ కామెంట్స్ పట్ల రియాక్ట్ అయ్యింది రేణు. ఇప్పుడు మరోసారి పవన్ ఫ్యాన్స్ పై మండిపడింది.

Renu Desai: ఎందుకిలా చేస్తున్నారు.. నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..
Renu Desai
Rajitha Chanti
|

Updated on: May 18, 2024 | 3:37 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలు గడుస్తున్న సంగతి తెలిసిందే. విడిపోయిన తర్వాత పవన్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండగా.. తన ఇద్దరు పిల్లను పెంచుకుంటూ స్వతంత్రంగా జీవిస్తున్నారు రేణు దేశాయ్. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు రేణు. ఇటీవలే టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ కూడా ఇచ్చారు. నెట్టింట నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు. తన ఇద్దరు పిల్లల గురించి ఫోటోస్, వీడియోస్ పంచుకుంటారు. అలాగే ముందు నుంచి రేణు దేశాయ్ యానిమల్ లవర్. ఎప్పుడూ జంతువులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తారు. అయితే రేణు దేశాయ్ చేసిన ప్రతి పోస్టుకు కొంతమంది నెటిజన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువస్తూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే చాలాసార్లు ఈ కామెంట్స్ పట్ల రియాక్ట్ అయ్యింది రేణు. ఇప్పుడు మరోసారి పవన్ ఫ్యాన్స్ పై మండిపడింది.

తాజాగా జంతువుల సర్వీస్ కు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇక ఆ పోస్టుకు పవన్ అభిమాని రియాక్ట్ అవుతూ.. వాళ్లు కూడా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్ చేశాడు. ఇక అందుకు రేణు రిప్లై ఇస్తూ “ఎందుకు ప్రతిసారి నేను చేసిన పోస్టుల కింద నా మాజీ భర్తతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను చాలా మందిని బ్లాక్ చేశాను. డిలీట్ చేశాను. నేను ఒంటరిగా యానిమల్ సర్వీస్ చేస్తున్నారు. నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి జంతువులకు సర్వీస్ చేస్తున్నాను. దీనికి నా మాజీ భర్తకు సంబంధం లేదు. దయచేసి నా ప్రతి పోస్టుకు ఆయనతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేయకండి. అతడు నాలాగా యానిమల్స్ పై ప్రేమ, కేరింగ్ చూపించడు ” అంటూ కామెంట్ చేసింది.

ఇక అదే కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. ఇలాంటి రిప్లైలు తనకు చాలా బాధను, కోపాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది. ఇన్నేళ్లైనా.. తన సొంతంగా ఏం చేసినా తన మాజీ భర్తతో కంపేర్ చేస్తారని.. తనతో ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్ లేదని.. అతడి ఫాలోవర్స్ తనను వదిలేయాలని కోరింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇక కొందరు నెటిజన్స్ రేణు దేశాయ్ కు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Renu Desai 1

Renu Desai 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు
గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో
గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. లైవ్ వీడియో..
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. లైవ్ వీడియో..
పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ..
పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ..
జూలై కరెంట్ బిల్లు చూడగా.. మాస్టర్ గారికి షాక్ కొట్టినంత పనైంది..
జూలై కరెంట్ బిల్లు చూడగా.. మాస్టర్ గారికి షాక్ కొట్టినంత పనైంది..
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు..
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు..
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో