Krishnam Raju: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టి.. విలన్, సపోర్టింగ్ రోల్స్‌లో నటించి మెప్పించిన కృష్ణం రాజు

| Edited By: Ravi Kiran

Sep 11, 2022 | 8:47 AM

1966లో టాలీవుడ్ లో అడుగు పెట్టారుకృష్ణం రాజు. కెరీర్ లో మొదటి చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. సాంఘిక, జానపద, హిస్టారికల్ సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి తనదైన నటనతో ఆహార్యంతో ప్రేక్షకులను మెప్పించారు.

Krishnam Raju: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టి.. విలన్, సపోర్టింగ్ రోల్స్‌లో నటించి మెప్పించిన కృష్ణం రాజు
Krishnam Raju
Follow us on

Krishnam Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దాదాపు 190 సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించారు. చిలకా గోరింక చిత్రంతో హీరోగా వెండి తెరపై అడుగు పెట్టారు. హీరోగా అడుగు పెట్టిన కృష్ణం రాజు కెరీర్ మొదట్లో యాంటీహీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు.  కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన చిలకా గోరింక సినిమాలో కృష్ణం రాజు కృష్ణ కుమారితో కలిసి 1966లో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. కెరీర్ లో మొదటి చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. సాంఘిక, జానపద, హిస్టారికల్ సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి తనదైన నటనతో ఆహార్యంతో ప్రేక్షకులను మెప్పించారు కృష్ణం రాజు.

ఎన్‌టి రామారావు తో కలిసి శ్రీ కృష్ణావతారంలో నటించారు. కృష్ణ కుమారి, రాజసులోచన , జమున , వాణిశ్రీ కాంచన వంటి సీనియర్ హీరోయిన్లతో పాటు, జయసుధ, జయప్రద, శ్రీదేవి  వంటి నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్లతో జతకట్టారు. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1965 లో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా  యష్ చోప్రా వక్త్ సినిమా తెలుగు రీమేక్  భలే అబ్బాయిలో నటించారు. అంతేకాదు అమ్మకోసం అనే సినిమాలో రేఖతో జతకట్టారు. ఈ సినిమా రేఖకు మొదటి సినిమా కావడం విశేషం.

బుద్ధిమంతుడు , మారాలి , మల్లి పెళ్లి , జై జవాన్, అనురాధ, భాగ్యవంతుడు, బంగారు తల్లి వంటి చిత్రాలలో నటించాడు. బడి పంతులు , బాల మిత్రుల కథ , జీవన తరంగాలు , కన్న కొడుకు వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు కృష్ణం రాజు.  కృష్ణం రాజు తన సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్‌ను స్థాపించి పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. తాను స్వయంగా నటించి నిర్మించిన కృష్ణవేణి సినిమా విమర్శకుల ప్రశంసలను పొందింది. భక్త కన్నప్పలో అర్జునుడిగా నటించి మెప్పించారు.  బాపు దర్శకత్వం వహించిన కన్నప్ప నాయనార్ ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఏకైక తెలుగు చిత్రం.

ఇవి కూడా చదవండి

కృష్ణంరాజు న‌ట‌న‌కు వ‌చ్చిన అవార్డులు చాలానే. అమ‌ర‌దీపం, మ‌న‌వూరి పాండ‌వులు సినిమాల‌కు రాష్ట్ర‌ప‌తి అవార్డులు అందుకున్నారు. అమ‌ర‌దీపం, ధ‌ర్మాత్ముడు, బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌, తాండ్ర పాపారాయుడు చిత్రాల‌కు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. అమ‌ర‌దీపం, బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న సినిమాల‌కు నంది అవార్డులు వ‌రించాయి. 2014లో ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు పుర‌స్కారం అందుకున్నారు.

1991లో కృష్ణంరాజు విధాత , బావ బావమరిది , జైలర్‌ గారి అబ్బాయి, అందరూ అందరే , గ్యాంగ్‌మాస్టర్‌ చిత్రాల్లో నటించారు . 1994లో, అతను పల్నాటి పౌరుషంలో నటించాడు, అది అతనికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.  రుద్రమ దేవి సినిమాలో రుద్రమదేవి తండ్రి గణపతిదేవుడిగా నటించి మెప్పించారు కృష్ణం రాజు.

కృష్ణంరాజు కెరీర్‌లో ప్ర‌తి చిత్ర‌మూ ఆణిముత్య‌మే. న‌టుడిగా త‌న‌దైన శైలితో ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు కృష్ణంరాజు. ఆయ‌న తెర‌మీద క‌నిపిస్తే క‌చ్చితంగా ఆ పాత్ర‌కు ఏదో ప్ర‌త్యేకం ఉంటుంద‌ని జ‌నాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.

 

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..