Tiger NageswaraRao 1st Day Collections: ‘టైగర్ నాగేశ్వర రావు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రావణసూర వసూళ్లు బ్రేక్ చేసిన రవితేజ..
వంశీ దర్శకత్వం వహించిన తెలుగు పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా, మురళి శర్మ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రవితేజ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని.. ఇక యాక్షన్ సన్నివేశాలు సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ వచ్చాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు భారతదేశంలో రూ.8 కోట్ల నికర వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఉదయం నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. వంశీ దర్శకత్వం వహించిన తెలుగు పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా, మురళి శర్మ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రవితేజ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని.. ఇక యాక్షన్ సన్నివేశాలు సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ వచ్చాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు భారతదేశంలో రూ.8 కోట్ల నికర వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది.
ఈ చిత్రం తెలుగులో 53.18% ఓవరాల్ ఆక్యుపెన్సీని వచ్చిందని తెలుస్తోంది. ఇక బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. ఇక నైట్ షోలలో 69.72% ఆక్యుపెన్సీ, మార్నింగ్ షోలలో 49.46% ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో ఈ చిత్రం 360 షోలను కలిగి ఉంది ఈ సినిమాకు 56.5% ఆక్యుపెన్సీ వచ్చింది.
Tiger is all yours from today 🤗 See you at the theatres :)))#TigerNageswaraRao pic.twitter.com/F8vNMZo2a8
— Ravi Teja (@RaviTeja_offl) October 20, 2023
ఇదిలా ఉంటే.. రవితేజ చివరిసారిగా కనిపించిన రావణాసుర సినిమా తొలిరోజు కలెక్షన్స్ రూ.6 కోట్లు వచ్చాయి. ఇక ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన వాల్తేరు వీర్యయ సినిమా మొదటి రోజే దాదాపు రూ.29.6 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ రెండు చిత్రాలతో.. టైగర్ నాగేశ్వర్ కేవలం భారతదేశంలోనే రూ.8 కోట్లు రాబట్టింది. దసరా పండగ సందర్భంగా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.
6 years… see how the time flies! Thank you Aniluuuu for the wishes 🤗
Wishing you, Balakrishna garu and the entire #BhagavanthKesari team the very best for the release tomorrow! https://t.co/xE5KVJ0ihp
— Ravi Teja (@RaviTeja_offl) October 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.