Raviteja: మాస్ మహరాజా మంచి మనసు.. 70 ఏళ్ల బామ్మల కోసం రవితేజ ఏం చేశాడంటే..
సిందూరం సినిమాతో హీరోగా పరిచయమైన రవితేజ.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఖడ్గం, విక్రమార్కుడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. హీరోయిజం కాదు.. తనదైన కామెడీ టైమింగ్.. యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు రవితేజ. తనకంటే చిన్నవారితో.. పెద్దవారితో ఎంతో మర్యాదగా.. ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తుంటారు. తాజాగా 70 ఏళ్ల బామ్మల కోసం మాస్ మాహరాజా చేసిన పని అందరిని ఆకట్టుకుంటుంది.
మాస్ మాహరాజా రవితేజ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. విలనిజం, సహాయ నటుడిగా కనిపించిన ఆయన.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో. సిందూరం సినిమాతో హీరోగా పరిచయమైన రవితేజ.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఖడ్గం, విక్రమార్కుడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. హీరోయిజం కాదు.. తనదైన కామెడీ టైమింగ్.. యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు రవితేజ. తనకంటే చిన్నవారితో.. పెద్దవారితో ఎంతో మర్యాదగా.. ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తుంటారు. తాజాగా 70 ఏళ్ల బామ్మల కోసం మాస్ మాహరాజా చేసిన పని అందరిని ఆకట్టుకుంటుంది. ఈ విషయం తెలిసి రవితేజ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా ?. అసలు విషయానికి వస్తే..
మరికొన్ని రోజుల్లో ఈగల్ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు రవితేజ. అలాగే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ కారంపూడిలో జరుగుతుంది. అయితే అక్కడికి వెకేషన్‌కు వచ్చిన 70 ఏళ్ల బామ్మలు రవితేజ షూటింగ్ విషయం తెలుసుకున్నారట. వెంటనే ఆయనను కలిసేందుకు సెట్ వద్దకు వచ్చారట. ‘రవితేజని కలవడం కుదురుతుందా ?’ అని అడిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రవితేజ.. షూటింగ్ అయిన తర్వాత వారిని కలిసేందుకు వారిని వెతుకుంటూ వెళ్లారట. రవితేజ వెళ్లిన సమయానికి వారంతా భోజనం చేస్తున్నారట. హీరో రావడంతో వారంతా భోజనం ఆపేసి రాబోయారట.
దీంతో రవితేజ వారిని భోజనం చేసిన రావాలని.. అప్పటివరకు తాను అక్కడే వెయిట్ చేస్తానని చెప్పారట. వారంతా భోజనం చేసేవరకు వెయిట్ చేసి .. ఆ తర్వాత వారితో మాట్లాడి.. ఫోటో దిగారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. తనను కలిసేందుకు వచ్చిన పెద్ద వారిపట్ల రవితేజ చూపించిన జాగ్రత్త.. గౌరవం పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రవితేజ నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
70+ elderly women who came on vacation asked the team whether there would be any chance to meet Ravi Teja. The actor who came to know about it went to their place, after the shoot yesterday. He waited till they completed their dinner and then posed for a photograph with them. pic.twitter.com/K5ZDXEZvQd
— Trends Raviteja™ (@trends4raviteja) February 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.