Raviteja Khiladi: ఖిలాడి నుంచి అదిరిపోయే సర్ప్రైజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మాస్ మహారాజా..
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని శరవేగంగా

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. క్రాక్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన మాస్ మాహారాజా.. వీలైనంత తొందరగా తన నెక్ట్స్ మూవీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఖిలాడీ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి. మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ కేద్కర్ .. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. ఖిలాడీ నుంచి ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.ఇక దీపావళి కానుకగా విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఖిలాడి టైటిల్ సాంగ్ మంచి మాస్ బీట్స్ తో సాగిన ఈ పాట సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీలో ప్రత్యేకమైన పాత్రలో అనసూయ మెరవనుంది.
ట్వీట్..
See you in cinemas ? #Khiladi
February 11th, 2022. pic.twitter.com/vCW6y3P1Kf
— Ravi Teja (@RaviTeja_offl) November 11, 2021
Also Read: Nagineedu: మర్యాద రామన్న సినిమా నాకు మైనస్ అయ్యింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగినీడు..
Hyper Aadi: తనపై దాడి చేశారనే వార్తలపై స్పందించిన హైపర్ ఆది.. వారికి స్వయంగా డబ్బులిస్తానంటూ..
Megastar Chiranjeevi: గ్రాండ్‌గా ప్రారంభమైన భోళా శంకర్.. చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలు లైవ్..
Bigg Boss 5 Telugu: కేక్ తినేసిన సన్నీ.. రచ్చ చేసిన ఆనీ మాస్టర్.. ఇదేక్కడి గోల..




