Bigg Boss 5 Telugu: కేక్ తినేసిన సన్నీ.. రచ్చ చేసిన ఆనీ మాస్టర్.. ఇదేక్కడి గోల..

బిగ్‏బాస్ సీజన్ 5...జెస్సీ ఇంటి నుంచి బయటకు కాకుండా సిక్రెట్ రూంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో గార్డెన్

Bigg Boss 5 Telugu: కేక్ తినేసిన సన్నీ.. రచ్చ చేసిన ఆనీ మాస్టర్.. ఇదేక్కడి గోల..
Sunny
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 11, 2021 | 7:09 AM

బిగ్‏బాస్ సీజన్ 5…జెస్సీ ఇంటి నుంచి బయటకు కాకుండా సిక్రెట్ రూంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో గార్డెన్ ఏరియాలో కేక్ ముక్క పెట్టారు బిగ్‏బాస్. ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉందంటూ సందేహం పెట్టాడు బిగ్‏బాస్. అయితే ఆ కేక్ తినడానికి మొదటి నుంచి సన్నీ ఆసక్తిగా చూపించాడు. దీంతో ఆనీ మాస్టర్ అతడిని వారించింది. తింటే ఆన్సర్ దొరుకుతుందని సన్నీ అనగా.. కాదు అంటూ అడ్డంగా వాదించింది ఆనీ మాస్టర్. ఇక కేక్ తినే అర్హత ఎవరికి ఉందనే విషయం ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది.

ఇక అనంతరం కెప్టెన్ నేను కాబట్టి… ఆ కేక్ తినే అర్హత నాకే ఉందని చెప్పింది ఆనీ మాస్టర్. దీంతో సన్నీ.. మీకు అర్హత ఉంటే తినండి మరి.. లేదంటే నేను తినేస్తా.. రిస్క్ తీసుకుంటా అని ముందుకు వచ్చాడు సన్నీ. ఇక సీక్రెట్ రూంలో ఉన్న జెస్సీ అభిప్రాయాన్ని అడగ్గా.. రవి 8 వారాలు నామినేషన్స్‏లో ఉన్నాడు… పోరాడుతున్నాడు.. అతనికే అర్హత ఉందని చెప్పాడు జెస్సీ. ఇక ఆ కేక్ ను మానస్‏కు ఇవ్వాలని ఉందని పింకీ చెప్పడంతో.. నువ్వు అన్ని అతనికే ఇచ్చుకో… నేను కనిపించడం లేదా అని సన్నీ అనగా.. పింకీ ఇలా తయారైంది అంటూ పంచ్ వేశాడు రవి. ఇక కేక్ తింటే ఇమ్యూనిటీ వస్తుందేమో అని రవి అనగా.. అసలు అర్హత ఏంటో తెలియదు అని చెప్పింది కాజల్. ఇక కేక్ తినే విషయంలో ఇంటి సభ్యుల మధ్య చర్చ జరుగింది. ఇక ఉదయాన్నే సన్నీ మానస్‏తో చర్చించి.. కెప్టెన్ అపోచ్చని అక్కడ రాయలేదు కదా.. అంటూ వెళ్లి ఆ కేక్ తినేస్తాడు. ఇక సన్నీ కేక్ తింటున్నంతసేపు మాసన్, శ్రీరామ్ తెగ నవ్వుకున్నారు. అయితే దీంతో సన్నీ.. నాకు కంగారు ఆగదు.. తీటగాడిని.. ఇప్పుడు ఏం పంచాయితీ అవుతుందో అంటూ అనుమానపడ్డాడు. ఇక సన్నీ కేక్ తినేసాడు అని తెలియగానే ఆనీ మాస్టర్ బయటకు వచ్చి నోరెళ్లబెట్టింది. నువ్ కెప్టెన్ అయితే ఇలాగే చేస్తావా. ? అంటూ సన్నీని అడగ్గా.. అక్కడ కెప్టెన్ రూల్ చేయాలని రాసి లేదు.. ఆకలేసింది తినేశా.. అని చెప్పాడు. ఇది నాది… నువ్వు ఎందుకు తినేశావ్.. స్ట్రాటజీ ప్లే చేశావ్ అంటూ రచ్చ చేస్తూ ఏడ్చేసింది ఆనీ మాస్టర్. మొత్తానికి కేక్‏తో ఇంట్లో మరోసారి రచ్చ జరిగింది. ఇక ఆ తర్వాత ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్‌లోనూ బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో ఇంటి సభ్యులు ఎవరి పాత్రలలో వారు జీవించేశారు.

Also Read: Keerthy Suresh: కీర్తిసురేష్‌లోని అద్భుతమైన టాలెంట్‌ను బయటపెట్టనున్న తమన్.. అదేంటంటే..

Venkatesh : సీనియర్ హీరో వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..

Vijay Devarakonda : బాలీవుడ్‌లో సొంత గొంతు వినిపించనున్న విజయ్ దేవరకొండ.. దేనికోసం అంటే..