Balakrishna: బాలయ్య మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఎదో తెలుసా..? ఆ సినిమా ఏ హీరో చేశారంటే
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ లో నటించి అలరించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతోన్నారు. అఖండ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు. అలాగే రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మరో హిట్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ లో నటించి అలరించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ నటించింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఒక సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నారట. బాలకృష్ణ చేయాల్సిన సినిమాను మాస్ మహారాజా రవితేజ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. ఇంతకు ఆ సినిమా ఏంటంటే..
బాలయ్య మిస్ చేసుకున్న సినిమా ఏంటంటే.. రవితేజ నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా క్రాక్. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చి బిగ్ హిట్ అందుకుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ముందుగా బాలకృష్ణ తో చేయాలనీ అనుకున్నారని తెలుస్తోంది. బాలయ్య కోసం అనుకున్న ఈ సినిమా ఆయన డేట్స్ దొరక్కపోవడంతో రవితేజను హీరోగా ఫైనల్ చేసుకున్నట్లు వెల్లడించారు నిర్మాత సి కళ్యాణ్. అలా బాలయ్య ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను మిస్ చేసుకున్నారట.