Subbaraju: హీరోలను మించిన అందగాడు.. అయినా పెళ్లి చేసుకోకపోడానికి రీజన్ ఇదే
సుబ్బరాజు భీమవరంలో పెన్మత్స రామకృష్ణం రాజు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. భీమవరంలోని డిఎన్‌ఆర్ కళాశాలలో చదువుకున్నాడు . అతను కంప్యూటర్ కోర్సు చేసి హైదరాబాద్‌లోని డెల్ కంప్యూటర్స్‌లో చేరడానికి ముందు మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు.
సుబ్బరాజు టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో ఆయన నటించాడు. అన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. ఫిట్‌నెస్ బాగా మెయింటైన్ చేస్తూ.. మంచి రోల్స్ దక్కించుకుంటున్నారు. సుబ్బరాజు యాక్సిడెంటల్‌గా ఇండస్ట్రీకి పరచయమయ్యాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ..పర్సనల్ కంప్యూటర్‌కు ఏదో ప్రాబ్లం రావడంతో.. దాన్ని బాగు చేపించమని తన అసిస్టెంట్‌కు సూచించారు. ఆ సమస్య సాల్వ్ చేసేందుకు అక్కడికి వెళ్లాడు సుబ్బరాజు. అక్కడ సుబ్బరాజును చూసిన కృష్ణవంశీ.. ఒడ్డూ పొడుగు బాగుండటంతో ఖడ్గం సినిమాలో చిన్న రోల్ ఇచ్చాడు.
సుబ్బరాజు ప్రజంట్ ఏజ్ 45 సంవత్సరాలు. కానీ ఆయన ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోలేదు. ఇదే విషయాన్ని ఆయన్ని అడిగితే పెళ్లి ఎందుకు చేసుకోవాలో తనకు అర్థం కాలేదని చెపుకొచ్చారు. ” ఏదైనా పని చేయడానికి రీజన్ ఉంటుంది. ఏదో పని చేయలేదు.. దానికి రీజన్ ఏంటి అంటే.. చెప్పలేం. పెళ్లి చేసుకోకపోవడానికి నా దగ్గర ఉన్న సింపుల్ ఆన్సర్ ఇదే. నా ఒపెనియన్ ప్రకారం పెళ్లి జరగకూడదు. చేసుకోవాలి. 25, 30 ఏళ్లు వచ్చినయ్ పెళ్లి చేసుకోవాలి.. అందరికీ అయిపోతున్నయ్.. పెళ్లి చేసుకోవాలి.. పేరెంట్స్ ప్రెజర్.. ఇలాంటి వాటిని నేను పెళ్లికి ప్రామాణికంగా తీసుకోను. నా లైఫ్ అండ్ సోల్‌ను ఒక అమ్మాయికి పూర్తిగా ఇవ్వగలను అని నమ్మకం వచ్చినప్పుడు నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఒక పెళ్లి చేసుకుని.. ఇది వర్కువుట్ అవ్వకపోతే ఇంకొకటి చూద్దాం అనేది నా మైండ్‌లో ఎప్పుడూ ఉండదు. పెళ్లి.. కారు, ఇల్లు లాంటిది కాదు. మొత్తంగా పెళ్లిళ్లు జరక్కూడదు. చేసుకోవాలి” అని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి