Ravanasura: మాస్ మహారాజ రవితేజ రావణాసుర వారం రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ కనిపించారు. సినిమా రిలీజ్ కంటే ముందు విడుదలైన టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వరుసగా రెండు హిట్ అందుకున్న రవితేజ రీసెంట్ గా రావణాసుర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ కనిపించారు. సినిమా రిలీజ్ కంటే ముందు విడుదలైన టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సుశాంత్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటించారు. ఇక ఈ సినిమా మొదటి వారం ఎంత వసూల్ చేసిందంటే..
నైజాం 4.01 కోట్లు, సీడెడ్ 1.44 కోట్లు, ఉత్తరాంధ్ర 1.35 కోట్లు, ఈస్ట్ 0.72 కోట్లు, వెస్ట్ 0.46 కోట్లు, గుంటూరు 0.75 కోట్లు, కృష్ణా 0.54 కోట్లు, నెల్లూరు 0.32 కోట్లు, ఏపీ , తెలంగాణ కలిపి 9.59 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.83 కోట్లు, ఓవర్సీస్ 1.11 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 11.53 కోట్లు షేర్ ను రాబట్టింది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.7.47 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రావణాసుర సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.