Ravi Teja: సినిమా రిలీజ్ కాకుండానే మరోసారి ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన మాస్ రాజా..

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. అప్పుడెప్పుడో రాజా ది గ్రేట్ సినిమాతర్వాత వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు రవితేజ.

Ravi Teja: సినిమా రిలీజ్ కాకుండానే మరోసారి ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన మాస్ రాజా..
Ravi Teja
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 09, 2022 | 9:49 AM

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ప్రస్తుతం సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు రవితేజ. ఆ తర్వాత ఈ మధ్య క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకున్నారు. శృతిహానాస్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవవడంతో రవితేజ తిరిగి ఫామ్ లోకి వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ తిరిగి ఫ్లాప్ లుగా మారాయి. రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా నిరాశపరచడంతో రవితేజ ఫ్యాన్ డీలా పడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి రెడీగా ఉన్నాడు రవితేజ. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ రావణాసుర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు సినిమా అయిపోవచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో సుధీర్ వర్కింగ్ స్టైల్ నచ్చి మరో సినిమా ఛాన్స్ ఇచ్చాడట మాస్ రాజా. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారట. ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు.సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారట.ప్రస్తుతం రవితేజ చేస్తున్న ప్రాజెక్ట్స్ అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నడని అంటున్నారు. ఇక రవితేజ నటిస్తున్న సినిమాల్లో ధమాకా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.