Rashmika Mandanna: ‘ఆ రోజులను మిస్ అవుతున్నాను’.. రష్మిక పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్..
మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది రష్మిక. అటు సినిమాలతో.. ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. కొన్నిసార్లు అభిమానులతో లైవ్ చిట్ చాట్స్ చేస్తూ సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. తాజాగా ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టాలో పంచుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఇప్పుడు తాను తన ట్రావెలింగ్ రోజులను మిస్ అవుతున్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది రష్మిక.

పుష్ప 2, యానిమల్ సినిమాల చిత్రీకరణలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా. ఈ రెండు చిత్రాలే కాకుండా నేషనల్ క్రష్ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ బ్యూటీ దక్షిణాదిలో మరిన్న ఆఫర్స్ క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది రష్మిక. అటు సినిమాలతో.. ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. కొన్నిసార్లు అభిమానులతో లైవ్ చిట్ చాట్స్ చేస్తూ సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. తాజాగా ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టాలో పంచుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఇప్పుడు తాను తన ట్రావెలింగ్ రోజులను మిస్ అవుతున్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది రష్మిక.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రావెలింగ్ ఫోటో వైరలవుతుంది. గతంలో టర్కీలో విహారయాత్రంలో ఉన్న ఫోటోను ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “మొదటి చిత్రం గమ్యస్థానం.. వీడియోను నేను వెతికేందుకు ప్రయత్నిస్తున్నాను. ట్రావెలింగ్ రోజులను మిస్ అవుతున్నాను ” అంటూ రాసుకొచ్చింది రష్మిక . ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పోస్ట్ చేసిన ఫోటో చూస్తే టర్కీకి చెందినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఫోటోకు మరోసారి విజయ్ దేవరకొండను ముడి పెడుతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇటీవల విడుదలైన ఖుషి సినిమాను టర్కీలో తెరకెక్కించారు. ఆ సమయంలో అక్కడ దిగిన ఫోటోను విజయ్ సైతం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఆ రెండు ఫోటోలను జతచేస్తూ వీరిద్దరు ఒకేసారి టర్కీలో వెకెషన్ వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
