Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranga Maarthaanda: ఓటీటీలో అదరగొడుతోన్న రంగమార్తాండ.. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటనకు ఫిదా అవుతోన్న ప్రేక్షకులు

నిజజీవితంలో తండ్రిగా.. భర్తగా ఫెయిలయిన వ్యక్తి కథే ఈ సినిమా! క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్లో.. జాలువాయిన మరో ఆణిముత్యమే ఈ సినిమా! అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్ములేపుతోంది.

Ranga Maarthaanda: ఓటీటీలో అదరగొడుతోన్న రంగమార్తాండ.. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటనకు ఫిదా అవుతోన్న ప్రేక్షకులు
Rangamarthanda
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 14, 2023 | 8:54 AM

రంగమార్తాండ! ఓ చిన్న సినిమా! ఎమోషనల్ సినిమా! మధ్య తరగతి మనస్తత్వాలను ప్రతిబింబించే సినిమా..! వయసైపోయిన తండ్రి పిల్లల కారణంగా పడే బాధే ఈ సినిమా..! నాటకాల్లో అన్ని పాత్రలను పోషించి అవార్డులు రివార్డులు అందుకున్నా.. నిజజీవితంలో తండ్రిగా.. భర్తగా ఫెయిలయిన వ్యక్తి కథే ఈ సినిమా! క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్లో.. జాలువాయిన మరో ఆణిముత్యమే ఈ సినిమా! అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇండియాలోనే టాప్‌ 2 మూవీగా లిస్టవుట్ అయింది.

ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీ రోల్లో.. మరాఠా ఫిల్మ్ నటసామ్రాట్‌కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా.. మార్చ్‌ 22న థియేటర్లలో రిలీజ్‌ అయి.. పాజిటివ్ టాక్‌తోనే.. కొద్ది రోజులు రన్ అయింది. కానీ బిగ్ హిట్ గా మారలేకపోయింది.

అలాంటి ఈ ఫిల్మ్ తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. చడీ చప్పుడు కాకుండా.. ఏప్రిల్ 6 అర్థరాత్రి నుంచి స్ట్రీమ్ అవుతోంది. స్ట్రీమ్ అవ్వడమే కాదు.. ఇప్పుడు ఏకంగా ఓటీటీలోనే హైయెస్ట్ వ్యూవ్‌డ్‌ తెలుగు సినిమాగా మారింది. ప్రైమ్‌ లో స్ట్రీమ్‌ అయ్యే.. ఇండియన్ టాప్‌ 10 ఫిల్మ్స్‌ లిస్ట్లో 2 ప్లేస్ కొట్టేసింది. ఈ రెస్పాన్సే కదా.. ఇలాంటి మంచి సినిమాకు రావాల్సిందనే టాక్ దీంతో.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.