AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali: థియేటర్లలో ‘రణబాలి’.. అలా అని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తా.. విజయ్ దేవరకొండ మహిళా అభిమాని బంపరాఫర్

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ ‘రణబాలి’ సినిమా. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో రణబాలి సినిమా గురించి ఒక మహిళా అభిమాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Ranabaali: థియేటర్లలో ‘రణబాలి’.. అలా అని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తా.. విజయ్ దేవరకొండ మహిళా అభిమాని బంపరాఫర్
Ranabaali Movie
Basha Shek
|

Updated on: Oct 18, 2026 | 1:43 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 16న రిలీజైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. టాక్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కూడా వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కొందరు రణబాలి సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా విజయ్ రష్మికలతో పాటు రణబాలి సినిమాను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మహిళా అభిమాని చేసిన ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘రణబాలి’ సినిమా చూసిన విజయ్ దేవరకొండ మహిళా అభిమాని ఒకరు.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు. ‘ రణ బాలి సినిమా చాలా బాగుంది. రణబాలిగా విజయ్, జయమ్మగా రష్మిక అద్భుతంగా నటించారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు కదా.. విజయ్ పుణ్యం కొద్దీ రష్మిక లాంటి భార్య దొరికింది’ అంటూ విరోజ్ జోడిపై ప్రశంసలు కురిపించింది సదరు మహిళా అభిమాని. ఇదే క్రమంలో ‘రణబాలి’ సినిమాపై వస్తోన్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. ఎవడైనా రణబాలి సినిమా బాగాలేదని నిరూపిస్తే కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ సవాల్ చేసింది. ఆశ్చర్యకరంగా పబ్లిక్ గా తన పేరు, ఫోన్ నంబర్ కూడా వెల్లడించింది. ‘నా మెడలో ఉన్న డైమండ్ నక్లెస్, చేతి గాజులు ఇచ్చినా కోటి రూపాయలు వస్తాయి. నేను ఇక్కడే థియేటర్ దగ్గరే కూర్చుంటాను. రణబాలి సినిమా బాగాలేదన్నవాళ్లు వచ్చి ఏం బాగాలేదో చెప్పాలి. అందరి అభిప్రాయం తీసుకొని సినిమా బాగాలేదంటే చెప్పినట్టుగానే కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాను’ అంటూ ట్రోలర్స్ కు సవాల్ విసిరిందామె .

రణబాలి సినిమా గురించి విజయ్ దేవరకొండ – రష్మిక అభిమాని మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.అయితే అంతా బాగానే ఉంది.. సదరు లేడీ అభిమాని బహిరంగంగా తన పేరు, ఫోన్ నెంబర్ వెల్లడించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ఆకతాయిలు ఆమె ను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టవచ్చని కామెంట్లు వస్తున్నాయి. 1854 – 1878 మధ్య కాలంలో బ్రిటిష్‌ ఇండియాలో జరిగిన వాస్తవ సంఘటలు, మహా కరువు నేపథ్యంలో ‘రణబాలి’ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రణబాలి సినిమాలో హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ విలన్ గా నటించడం విశేషం. అలాగే సీనియర్ నటి ఈశ్వరి రావు మరో కీలక పాత్రలో కనిపించారు. అజయ్ అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us