Rana Virata Parvam: విరాటపర్వం టీజర్‌ను ఎవరు విడుదల చేస్తారో తెలుసా? డప్పు కొట్టి మరీ చాటింపు వేసిన చిత్ర యూనిట్..
Rana Virata Parvam: దగ్గుబాటి నట వారసుడు రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా 'విరాట పర్వం' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై...
Rana Virata Parvam: దగ్గుబాటి నట వారసుడు రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా ‘విరాట పర్వం’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్ లైన్‌తో రానున్న ఈ సినిమా ప్రేమ, విప్లవం అనే కథాంశంతో రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్‌లుక్ ఫొటోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టీజర్‌ను మెగా స్టార్ చిరంజీవి విడుదల చేస్తుండడం విశేషం. అయితే టీజర్ విడుదల చేయనున్న విషయాన్ని చిత్ర యూనిట్ కాస్త వెరైటీగా ప్రకటించింది. ఓ వ్యక్తి డబ్బు కొడుతూ చాటింపు ద్వారా ‘విరాటపర్వం’ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారు అంటూ చెప్పించడం ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ వీడియో కూడా విరాట పర్వం సినిమా షూటింగ్ సెట్‌లోనే తీసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి మార్చి 18న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరి టీజర్ ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి.
సురేశ్ ప్రొడక్షన్స్ చేసిన ట్వీట్..
#VirataParvamTeaser ni Megastar @KChiruTweets garu 18th March, 5:04 PM ki release chestunnaraho? #VirataParvamOnApril30#VirataParvam@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #Priyamani @Naveenc212 @sureshbobbili14 @dancinemaniac @SLVCinemasOffl pic.twitter.com/lOPncvrxlR
— Suresh Productions (@SureshProdns) March 16, 2021
Also Read: Mahesh Babu : మహేష్ తో భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ బడా నిర్మాత.. హీరోయిన్ ఎవరంటే..