AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaavu Kaburu Challaga : ‘చావు కబురు చల్లగా’ చెప్పడానికి వస్తున్న కార్తికేయ.. యంగ్ హీరోను ఆకాశానికెత్తేసిన బన్నీ

టాలీవుడ్ లో నూతన ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కొత్తకొత్త నటులు, నూతన దర్శకులు, ఇంట్రస్టింగ్ స్టోరీస్ తో తెలుగు సినీపరిశ్రమ కళకళలాడుతుంది.

Chaavu Kaburu Challaga : 'చావు కబురు చల్లగా' చెప్పడానికి వస్తున్న కార్తికేయ.. యంగ్ హీరోను ఆకాశానికెత్తేసిన బన్నీ
Bunny
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2021 | 8:18 PM

Share

Chaavu Kaburu Challaga :  టాలీవుడ్ లో నూతన ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కొత్తకొత్త నటులు, నూతన దర్శకులు, ఇంట్రస్టింగ్ స్టోరీస్ తో తెలుగు సినీపరిశ్రమ కళకళలాడుతుంది. కొత్త కాన్సప్ట్స్ తో విభిన్నమైన కథలు తెరకెక్కుతున్నాయి. ఎప్పట్లా.. ఫార్మాట్‌ కథలు కాకుండా.. ప్రేఫ్‌ ట్రీట్‌మెంట్తో సినిమాలను రూపొందిస్తున్నారు. కథలో పాత వాసనలను మరవకుండానే.. కాస్త భిన్నంగా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడలా.. కార్తికేయ హీరోగా మన ముందుకు వస్తున్న సినిమానే ‘చావు కబురు చల్లగా’.

2018లో ఆర్ఎక్స్‌ 100 సినిమాతో మన ముందుకు వచ్చిక కార్తికేయ.. అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్‌ చేశాడు. భగ్న ప్రేమికుడిగా.. ప్రేమకు భలైన కుర్రాడిగా.. కార్తికేయ నటన అప్పట్లో టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా నిలిచింది. ఇక చావుకబురు చల్లగా సినిమాకుతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ ఈ సినిమాను కూడా నిర్మిస్తుంది. టీజర్‌తో చావు కబురు చల్లగా చెప్పి ప్రేక్షకులు కట్టిపడేసిన డైరెక్టర్‌ కౌశిక్‌ ఆతర్వాత టీజర్‌ గ్లింప్స్‌ అంటూ.. సినిమాలోని హీరో హీరోయిన్‌ల మధ్య సిన్నివేశాలను వదిలి సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేశాడు. కార్తికేయ, లావణ్యలో పాటు.. ఈ సినిమాలో అలనాటి హీరోయిన్‌ ఆమని.. మురళి శర్మలు ప్రధాన పాత్రల్లో నటించారు. మురళి శర్మ లావణ్య తండ్రి పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌ సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహించే అల్లు అర్జున్‌ ఈ సినిమాను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్గా విచ్చేశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ కార్తికేయ గురించి మాట్లాడుతూ… సినిమా చూసిన తరవాత కార్తికేయ వయసు ఎంత అని వాసుని మళ్లీ అడిగాను. 27, 28 సంవత్సరాలు ఉంటాయి అన్నాడు. ఆ వయసుకు నేను అలా పెర్ఫార్మ్ చేయలేదు.. ఈ యంగ్ స్టార్స్ ఏంటి ఇంత బాగా నటిస్తున్నారు అని అనిపించింది. నేను సరదాగా చెప్పడం లేదు.. బస్తీ బాలరాజు మీ గుండెలకు గుచ్చుకుంటాడు. నేను ఆర్ ఎక్స్100 చూశాను. కార్తికేయ చాలా బాగా చేశాడు.. హార్డ్ వర్క్ చేశాడు అని అర్థమైంది. కానీ, ఈరోజు నేను ఈ సినిమా చూసేసరికి అతను నటుడిగా ఎంత ఎదిగాడో తెలిసింది. మీరు కచ్చితంగా షాకవుతారు. సినిమా చూశాక బస్తీ బాలరాజు నా మనసుకు హత్తుకున్నాడు.. ఇప్పుడు కార్తికేయ జెన్యూన్ స్పీచ్ విన్నాక నాకు బాగా నచ్చాడు. అని బన్నీ అన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Best Wedding Wardrobe : ఫంక్షన్లకు భిన్నంగా రెడీ అవ్వాలనుకుంటున్నారా.. టాప్ టీవీ నటీమణుల వివాహ కలెక్షన్లు మీకోసం