Mahesh Babu : మహేష్ తో భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ బడా నిర్మాత.. హీరోయిన్ ఎవరంటే..

వరుస విజయాలతో దూసుకు పోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే దుబాయ్ లో మొదటి షడ్యూల్

Mahesh Babu : మహేష్ తో భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ బడా నిర్మాత.. హీరోయిన్ ఎవరంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 16, 2021 | 8:17 PM

Mahesh Babu : వరుస విజయాలతో దూసుకు పోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే దుబాయ్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ. ఇప్పుడు రెండో షెడ్యూల్ ను చకచకా జరుపుకుంటుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ మూవీలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాడనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. అయితే మహేష్ ఈ సినిమా తరువాత ఎవరితో సినిమా చేయబోతున్నాన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఎందులోనూ స్పష్టత లేదు. ఇక మహేష్ త్వరలోనే ఓ భారీ సినిమా చేయబోతున్నడని ఫిలిం సర్కిల్స్  లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించి అన్ని భాషల్లో క్రేజ్ ను మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ జాన్వీలతో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే మహేష్ తో సినిమాకోసం దర్శకధీరుడు రాజమౌళి సిద్ధంగా ఉన్నాడు. గతంలో ఎప్పుడో మహేష్ తో సినిమా ఉంటుందని జక్కన అనౌన్స్ చేసాడు. అప్పటినుంచి ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తిచేసిన తర్వాత మహేష్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ఇ మహేష్లాం సినిజమ కథ ఆఫ్రికా అడవికి సంబంధించి ఉంటుందని ఈ మధ్య చిన్న హింట్టి కూడా ఇచ్చారు. మరి ఇలాంటి సమయంలో మహేష్ హీరోగా పాన్ ఇండియా సినిమాను బాలీవుడ్ నిర్మాత ప్లాన్ చేస్తున్నాడా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chaavu Kaburu Challaga : ‘చావు కబురు చల్లగా’ చెప్పడానికి వస్తున్న కార్తికేయ.. యంగ్ హీరోను ఆకాశానికెత్తేసిన బన్నీ