AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanushree Dutta : 18 నెలల్లో 18 కిలోలు తగ్గిన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ.. అంతలా ఎందుకు కష్టపడిందో తెలిస్తే షాక్..

Tanushree Dutta : బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా అందరికి గుర్తుండే ఉంటుంది. గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్

Tanushree Dutta : 18 నెలల్లో 18 కిలోలు తగ్గిన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ.. అంతలా ఎందుకు కష్టపడిందో తెలిస్తే షాక్..
Tanushree Dutta
uppula Raju
|

Updated on: Mar 16, 2021 | 9:18 PM

Share

Tanushree Dutta : బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా అందరికి గుర్తుండే ఉంటుంది. గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది. అంతేకాకుండా ఈ వీడియోలో ఈ బ్యూటి చాలా నాజుకుగా కనిపించింది. తాను 18 నెలల్లో 18 కిలోలు తగ్గానని వెల్లడించింది. గతంలో బొద్దుగా ఉండే ఈ భామ ఇంతలా తగ్గిపోవడానికి కారణాలను వివరించింది.

2019లో ఉజ్జయినిలోని ఒక ఆలయాన్ని సందర్శించి, ఆ రోజు ఉపవాసం ఉండి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రతి సోమవారం ఉపవాసం ఉంటానని చెప్పింది. తన బరువు తగ్గుతున్నానని తెలుసుకొని వర్కవుట్లను పెంచడానికి ప్రత్యేకంగా ఓ శిక్షకుడిని నియమించుకున్నానని ప్రకటించింది. తర్వాత డైట్ కూడా మార్చుకున్నానని తెలిపింది. పిండి పదార్థాలు, చక్కెర, గ్లూటెన్ ను వదిలివేసి, వారానికి ఒక సూప్, సలాడ్ మరియు జ్యూస్ డైట్‌కు మారానని వెల్లడించింది. బరువులు ఎత్తడం, ఉపవాసం చేయడం, యోగా, ఈత మరియు డ్యాన్స్ చేయడం వంటి వాటితో బరువు తగ్గానని వివరించింది. 80 కిలోల నుంచి ఏకంగా 60 కిలోలకు తగ్గానని చెప్పింది.

అయితే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. నటీనటులు ఏదేని సినిమా కోసం పాత్రకు తగినట్లుగా మారిపోతారని తెలిపింది. తాను కూడా చిత్ర నిర్మాతలతో చర్చలు జరిపి ఇలా వెయిట్ లాస్ అయ్యానని అసలు నిజాలను వెల్లడించింది. టైమ్ బాగున్నప్పుడు అందరు బాగానే ఉంటారు. ఒక్కసారి రివర్స్ అయితే అంతా తారుమారై పోతుందంటు పేర్కొంది. ఆగస్టు 2019 వరకు తాను యూఎస్‌లో స్థిరపడ్డానని ప్రస్తుతం ఈ బరువుతో తాను బాగానే ఉన్నానని ప్రకటించింది.

తాను చాలా సంవత్సరాలు యూఎస్‌లో, ఇండియాలో ప్రముఖులతో పనిచేశానని నా గురించి వారికి చెడు అభిప్రాయం ఉంటే తనతో ఎందుకు పనిచేస్తారని ప్రశ్నించింది. కరోనా వల్ల దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఒక చిత్రానికి సంతకం చేసింది. అంతేకాకుండా మరో ముగ్గురితో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపింది. ఇద్దరు త్వరలో షూటింగ్ కూడా ప్రారంభించొచ్చు అంటు చెప్పింది. తాను మళ్లీ నటించడానికి వచ్చానని వారికి తెలుసు అందుకే తనను సంప్రదించారని వివరించింది.

Kamal Haasan : ఆటో ఎక్కిన కమల్ హాసన్.. కోయంబత్తూర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం

Sukumar -Ram : 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న రామ్ ‘జగడం’.. ఆసక్తికర కామెంట్లు చేసిన డైరెక్టర్ సుకుమార్..