Sukumar -Ram : 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న రామ్ ‘జగడం’.. ఆసక్తికర కామెంట్లు చేసిన డైరెక్టర్ సుకుమార్..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది

Sukumar -Ram : 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న రామ్ 'జగడం'.. ఆసక్తికర కామెంట్లు చేసిన డైరెక్టర్ సుకుమార్..
Sukumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 16, 2021 | 9:05 PM

Sukumar -Ram : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే సుకుమార్ త్వరలో రామ్ పోతినేనితో ఓ సినిమాను ప్లాన్‌ చేసే పనిలో పడ్డారు. ఇద్దరూ… తమ కెరీర్‌లో కలిసి నటించిన సినిమానే మళ్లీ రిమేక్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమా మరేదో కాదు “జగడం”.

హీరో రామ్.. డైరెక్టర్‌ సుకుమార్‌ల కెరీర్లో… రెండో సినిమాగా తెరెకెక్కిన సినిమా “జగడం”. ఈ సినిమా రిలీజై మార్చి 16నాటికి 15 ఏళ్లు నిండడంతో.. సుకుమార్ ఈ సినిమా గురించి కొన్న విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా తీసే సమయానిక సెన్సార్ రూల్స్ మీద తనకు పెద్దంత అవగాహన లేకపోవడంతో జగడం సినిమాలోని చాలా సన్నివేశాలు కత్తెరకు గురయ్యాయని, దాంతో మూవీ సోల్ కూడా మిస్ అయిపోయిందని సుకుమార్ అన్నారు. మొదట్లో బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైన కారణంగా ఈ సినిమా గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేకపోతుండేదని, అయితే ఒకసారి ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ఫ్లయిట్ లో కలిసి, ముంబైలోని చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర ‘జగడం’ మూవీ డీవీడీ ఉందనే విషయాన్ని తెలిపారని సుకుమార్ అన్నారు. అలానే ఆ రోజుల్లోనే రత్నవేలు సినిమాటోగ్రఫీ పరంగా రకరకాల ప్రయోగాలు చేశారని, స్టీవెన్ స్పీల్ బర్గ్ ఉపయోగించే కెమెరా ఎక్వీప్ మెంట్స్ నే తామూ ఉపయోగించామని చెప్పారు సుక్కు. ఇక దేవిశ్రీ ప్రసాద్ క్లయిమాక్స్ లో ఇచ్చిన నేపథ్య సంగీతం గురించి ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. రామ్ ను ఈ మూవీ షూటింగ్ లో చూస్తుంటే చాలా వండర్ గా ఉండేదని, అతను గొప్ప హైట్స్ కు వెళతాడనే నమ్మకం తనకు అప్పుడే కలిగిందని చెప్పారు. వీటన్నింటితో పాటు రామ్ తో ‘జగడం’ రీమేక్ చేయాలన్న మనసులోని మాటను బయటపెట్టారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu : మహేష్ తో భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ బడా నిర్మాత.. హీరోయిన్ ఎవరంటే..

Chaavu Kaburu Challaga : ‘చావు కబురు చల్లగా’ చెప్పడానికి వస్తున్న కార్తికేయ.. యంగ్ హీరోను ఆకాశానికెత్తేసిన బన్నీ

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?