Rajeev Rayala |
Updated on: Mar 16, 2021 | 10:24 PM
నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్నూ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమా తోనే కుర్రకారు కలలా రాకుమారిగా మారిపోయింది ఈ చిన్నది.
ముఖ్యంగా అను కళ్ళకు ఫిదాకాని కుర్రాడు ఉండడేమో .. మజ్ను సినిమాలో తన అమాయక చూపులు, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగు కుర్రకారును కవ్వించింది.
అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన ఈ క్యూట్ హీరోయిన్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో బిజీగా నటిస్తోంది.
సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఆ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో షేక్ చేస్తుంది ఈ కలువ కళ్ళ సుందరి.
ఇటీవల ‘అల్లుడు అదుర్స్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. తాజాగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది.
'మహాసముద్రం' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శర్వానంద్, సిద్ధర్థ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా అను హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
ఇక అను ఆశలన్నీ ఈసినిమా పైనే ఉన్నాయి. బోలెడన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్ సినిమా నిరాశపరచడంతో అను కెరియర్ డైలమాలో పడింది.
ఇప్పడు మహాసముద్రం సినిమా అయిన అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ కు ప్లెస్ అవుతుందేమో చూడాలి. ఈ సినిమా విజయం సాధిస్తే అనుకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏంజరుగుతుందో..