Rana Daggubati: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. పోలీస్ కేసుపై స్పందించిన రానా దగ్గుబాటి
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. మరికొందరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేయడంపై వివరణలు ఇస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరు దిగొస్తున్నారు. తాము ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడంపై వివరణ ఇస్తున్నారు. అలా తాజాగా హీరో రానా దగ్గుబాటి పీ ఆర్ టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్స్ కు రానా దగ్గుబాటి ప్రచారం పై వివరణ ఇచ్చింది. ‘నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు దీని గడువు 2017లో ముగిసింది. ఆన్‌లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్‌లను చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమెదం తెలిపారు . ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్ని భాగస్వామ్యాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. చట్టపరమైన సమీక్ష తర్వాత, చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ప్లాట్‌ఫామ్‌ను రానా అంగీకరించాడు. నైపుణ్యం ఆధారిత గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను రానా దగ్గుబాటి ఆమోదించడం చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే నిర్ధారించడానికి ఈ ప్రెస్ నోట్ జారీ చేస్తోన్నాం. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్‌లైన్ గేమ్‌లను హైలైట్ చేయడం చాలా అవసరం. ఈ గేమ్‌లు అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయి. అందువల్ల చట్టబద్ధంగా అనుమతిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది’ అని రానా దగ్గుబాటి టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి మియాపూర్ పీఎస్ పరిధలో 25మంది సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ తదితర సినీ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై విజయ్ దేవర కొండ, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు క్లారిటీ ఇచ్చారు. తాజాగా రానా దగ్గుబాటి కూడా వివరణ ఇచ్చారు. మరి దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
సుప్రీం కోర్టు తీర్పును వివరణ ఇచ్చిన రానా దగ్గుబాటీ టీమ్..
Official Statement from #RanaDaggubati‘s PR Team about #BettingApps Controversy
We would like to clarify that Rana Daggubati had an agreement with a company to promote a skill-based gaming platform. This contract ended in 2017.
His endorsement was strictly for regions where… pic.twitter.com/Lf7axXzSSu
— KLAPBOARD (@klapboardpost) March 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.