Dhanashree Verma: చహల్‌తో విడాకులు.. ధన శ్రీ ఆస్తులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్.. లైఫ్ స్టైల్ చూశారా.. ?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా మారుమోగుతున్న పేరు ధనశ్రీ వర్మ. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు మనస్పర్థలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే డివోర్స్ అనంతరం ధనశ్రీకి చహల్ ఇస్తోన్న భరణం గురించి చర్చ నడుస్తోంది. ఇంతకీ ధనశ్రీ వర్మ ఆస్తులు, లైఫ్ గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్ నటిగా మారింది ధనశ్రీ వర్మ. అందం, అభినయంతోపాటు.. అందంగా డ్యాన్స్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ కొన్ని రోజులుగా ఈ జంట గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. మనస్పర్థలతో ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ఇద్దరు నేరుగా స్పందిచలేదు. తాజాగా వీరికి ఫ్యామిలీ కోర్టు డివోర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ధనశ్రీకి చహల్ దాదాపు రూ.4 కోట్ల వరకు భరణం ఇచ్చేందుకు అంగీకరించాడట. ఈ క్రమంలోనే ధనశ్రీ పర్సనల్ లైఫ్, ఆమె ఆస్తుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ధనశ్రీకి ప్రస్తుతం 6.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 1996 సెప్టెంబర్ 27న దుబాయ్‌లో జన్మించిన ధనశ్రీ వర్మ ఇండియాలోనే పెరిగింది. సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ గా, డ్యాన్స్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యింది. ఆమె కొరియోగ్రాఫర్‌గా మారడానికి ముందు డెంటిస్ట్. నివేదికల ప్రకారం ధనశ్రీ వర్మ ఆస్తులు రూ.24 కోట్లు అని సమాచారం. సోషల్ మీడియాలో పోస్టులు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, మ్యూజిక్ వీడియోలలో కనిపించడం ద్వారా సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో పాటు, ఆమెకు యూట్యూబ్‌లో 2.7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నెట్టింట ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది.
గుర్గావ్‌లోని యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విలాసవంతమైన బంగ్లాలో నివసించారు. నివేదిక ప్రకారం , ఈ విలాసవంతమైన బంగ్లా విలువ రూ.25 కోట్లు. ఈ జంట విడిపోయినప్పటి నుండి, వర్మ వారి గుర్గావ్ ఇంట్లోనే ఉంటున్నారా లేదా తన కుటుంబంతో తిరిగి వచ్చారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆమె 2020లో యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట 2024లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..