AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రాను బొంబాయికి రాను’ సాంగ్‌కు 800 మిలియన్ల వ్యూస్.. రూ.5 లక్షల పాటకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

బిగ్ బాస్ ఫేమ్ రామూ రాథోడ్ ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ ఇటీవలే ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. గత ఏడాదిగా ట్రెండింగ్ లో ఉన్న ఈ ఫోక్ సాంగ్ ఇటీవలే యూట్యూబ్ లో 800 మిలియన్ల (80 కోట్ల) వ్యూస్ ను అధిగమించింది.

'రాను బొంబాయికి రాను' సాంగ్‌కు 800 మిలియన్ల వ్యూస్.. రూ.5 లక్షల పాటకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
Ramu Rathod Ranu Bombaiki Ranu Song
Basha Shek
|

Updated on: Apr 08, 2026 | 6:45 AM

Share

ఒకప్పుడు జానపద పాటలు కేవలం పల్లెటూర్లకో పరిమతమయ్యేవి. పండగలు, జాతర్లలో మాత్రమే ఈ ఫోక్ సాంగ్స్ వినిపించేవి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఈ పల్లెటూరి పాటలు అంతర్జాతీయ వేదికలపైనా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ పల్లె పాటలు సినిమా పాటలకు మించి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలా తెలంగాణ సంస్కృతికి చాటి చెప్పిన ‘రాను బొంబాయికి రాను’ ఇప్పుడు ఓ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఈ ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 800 మిలియన్ల (80 కోట్ల) వ్యూస్ సాధించింది. తద్వారా తెలుగు జానపద పాటల్లో ఓ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములోని’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ నిలిచింది. ఈ పాటకు యూట్యూబ్ లో ఇప్పటివరకు 937 మిలియన్లు (93 కోట్ల) వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడీ సినిమా సాంగ్ కు పోటీగా ఓ ఫోక్ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ రామూ రాథోడ్ సృష్టించిన ఈ సాంగ్ కు చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి దాకా అందరూ స్టెప్పులేసిన వాళ్లే. అలాగే సినిమా తారలు కూడా ఈ సాంగ్ కు రీల్స్‌ చేశారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈ పాట వినపడాల్సిందే.

‘రాను బొంబాయికి రాను’ సాంగ్ కు రామూ రాథోడ్.. స్వయంగా సాహిత్యాన్ని అందించి.. తనదైన శైలిలో గానం చేశాడు. దీనికి కళ్యాణ్ కీస్ అద్భుతమైన ట్యూన్ స్వరపరిచాడు. అలాగే శేఖర్ వైరస్ మాస్టర్ స్టెప్పులు ఈ సాంగ్ కు మరింత హైలెట్ గా నిలిచాయి. కాగా ఈ సాంగ్ కు 400 మిలియన్ల వ్యూస్ టైమ్‌లో ఈ పాటకు కోటికి పైగా రెవెన్యూ వచ్చిందని రామూ రాథోడే స్వయంగా చెప్పాడు. అలాంటిది ఇప్పుడు ఈ పాటకు ఏకంగా ఈ పాట 800 మిలియ వ్యూస్ దాటేసింది. అంటే ఈ లెక్కన ఈ పాటకు రూ.2 కోట్లకు పైగానే రెవెన్యూ వచ్చిందని తెలుస్తోంది. అయితే ఇందులో చాలా లెక్కలుంటాయి. యూట్యూబ్ వాటా, ఆదాయం ప్రకటనలు, అలాగే CPM (కాస్ట్ పర్ మైల్) ఆధారంగా ఈ ఆదాయం మారుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

‘రానూ బొంబాయికి రానూ’ వీడియో సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైలులో ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు..ఆ తర్వాత ఏమైందంటే..
రైలులో ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు..ఆ తర్వాత ఏమైందంటే..
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?