AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రైలు కిటికీ నుంచి ప్యాసింజర్ ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు.. ఆ తర్వాత ఏమైందో చూడండి

Viral Video: ఓ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రైలు కదులుతున్న సమయంలో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించాడనే అనుమానంతో ఓ వ్యక్తిని ప్రయాణికులు పట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రమాదకరంగా మారాయి.,

Viral Video: రైలు కిటికీ నుంచి ప్యాసింజర్ ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు.. ఆ తర్వాత ఏమైందో చూడండి
Phone Thief
Subhash Goud
|

Updated on: Oct 14, 2026 | 4:16 PM

Share

Viral Video: బీహార్‌లో షాకింగ్ ఘటన.. కదులుతున్న రైలు కిటికీకి వేలాడిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే? బీహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రైలు కదులుతున్న సమయంలో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించాడనే అనుమానంతో ఓ వ్యక్తిని ప్రయాణికులు పట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రమాదకరంగా మారాయి. కదులుతున్న రైలు కిటికీకి ఆ వ్యక్తి వేలాడుతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.

వరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని భాగల్‌పూర్‌ జిల్లాలో ఉన్న శివనారాయణ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద జరిగింది. ట్రైన్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరుతున్న టైమ్‌లో కిటికీ ద్వారా ప్రయాణికుడి మొబైల్‌ ఫోన్‌ను లాక్కునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే అతడిని పట్టుకున్నారు.

కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతూ..

ఆ వ్యక్తి తప్పించుకోకుండా ప్రయాణికులు అతడి చేతులను పట్టుకున్నారు. ఇంతలో రైలు ముందుకు కదలడంతో అతడు కిటికీ బయట వేలాడుతూ కనిపించాడు. రైలు కదులుతున్నప్పటికీ అతడిని కొంతదూరం వరకు అలాగే పట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరకు అతడు ప్లాట్‌ఫామ్‌పై పడిపోయాడు. ఈ దృశ్యాలు ఇప్పుడుసోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై రైల్వే భద్రతా సిబ్బంది స్పందించారు. అయితే, ఘటనకు సంబంధించిన వివరాలు, ఆ వ్యక్తి పాత్రపై అధికారిక దర్యాప్తు కీలకం కానుంది. మొబైల్‌ చోరీకి ప్రయత్నించాడనే ఆరోపణను నిర్ధారిత వాస్తవంగా పరిగణించకూడదు.

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి:

రైల్వే స్టేషన్లలో రైళ్లు బయలుదేరే సమయంలో మొబైల్‌ ఫోన్లు, పర్సులు వంటి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద ఘటన ఎదురైతే ప్రమాదకరంగా ఎదురుదాడి చేయకుండా రైల్వే పోలీసులకు లేదా రైల్వే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, కదులుతున్న రైలుకు బయట వేలాడటం లేదా అలాంటి వ్యక్తిని పట్టుకుని ఉంచడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. అయితే రైల్వే స్టేషన్‌లలో రైలు ఆగినప్పుడు, రైలు బయలుదేరుతున్నప్పుడు మొబైల్‌ల చోరీ ఘటనలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రైలులో ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు..ఆ తర్వాత ఏమైందంటే..
రైలులో ఫోన్ దొంగిలిద్దాం అనుకున్నాడు..ఆ తర్వాత ఏమైందంటే..
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?