Ram Pothineni: ఈ ఫొటోలో రామ్ పోతినేనితో ఉన్న బుడతడు ఎవరో తెలుసా.?
ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవ్ దాస్ సినిమాతో హీరోగా పరిచయమైన రామ్.. తనదైన నటనతో ప్రేక్షకుల ఆదరణ అందుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న రామ్ రీసెంట్ గా వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమా పక్క మాస్ మసాలా ఎంటైర్ టైనర్ గా తెరకెక్కనుంది. అలాగే ఈ మూవీ రామ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది .
ఇదిలా ఉంటే రామ్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు రామ్. తాజాగా రామ్ షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలో రామ్ ఒక బుడతడితో కలిసి కనిపించాడు. ఈ ఫొటోకు సన్ డే అనే క్యాప్షన్ ఇచ్చాడు రామ్. దాంతో ఈ చిన్నాడో ఎవరు..? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంతకు ఆ బుడతడు ఎవరంటే రామ్ సోదరుడి కొడుకు. రామ్ అన్న కొడుకుతో కలిసి రామ్ ఈ ఫోటోను ఆదివారం నాడు పోస్ట్ చేశాడు. అతడిపేరు సిద్ధాంత్ పోతినేని. దాంతో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
Coz it’s a SONday.. #Sidhanthpothineni pic.twitter.com/8hrXNNsjly
— RAm POthineni (@ramsayz) January 8, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.