Varasudu Movie: వాళ్లతో నాకు పోటీ వద్దు అందుకే నా సినిమా వాయిదా చేస్తున్న

Varasudu Movie: వాళ్లతో నాకు పోటీ వద్దు అందుకే నా సినిమా వాయిదా చేస్తున్న

Phani CH

|

Updated on: Jan 09, 2023 | 9:00 PM

విజయ్‌ హీరోగా నటించిన `వారసుడు` చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళంలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది.

విజయ్‌ హీరోగా నటించిన `వారసుడు` చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళంలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది. తమిళంలో సేమ్‌ డేట్‌కి రిలీజ్‌ కానుంది. కానీ తెలుగులో మాత్రం ఈ నెల 14న రిలీజ్‌ కానుందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు వెల్లడించారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ నటించిన `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలు భారీ రిలీజ్‌ ఉండటంతో థియేటర్ల సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు దిల్‌రాజు. దీనిపై పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Published on: Jan 09, 2023 09:00 PM