Balakrishna: మాస్ బీట్స్‏తో అదిరిపోయిన్ మాస్ మొగుడొచ్చాడే సాంగ్.. వీరసింహారెడ్డి మూవీలోని ఈ సాంగ్ విన్నారా ?..

వీరసింహారెడ్డి మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ 'మాస్ మొగుడు'ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై థమన్ మాసీవ్, ఎనర్జిటిక్ ట్రాక్‌ను అందించాడు. మనో, రమ్య బెహరా సూపర్ ఎనర్జిటిక్‌గా పాడారు .

Balakrishna: మాస్ బీట్స్‏తో అదిరిపోయిన్ మాస్ మొగుడొచ్చాడే సాంగ్.. వీరసింహారెడ్డి మూవీలోని ఈ సాంగ్ విన్నారా ?..
Veera Simha Reddy, Balakris
Follow us

|

Updated on: Jan 09, 2023 | 9:24 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఎస్ థమన్ తన మాస్-అప్పీలింగ్ కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ ‘మాస్ మొగుడు’ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై థమన్ మాసీవ్, ఎనర్జిటిక్ ట్రాక్‌ను అందించాడు. మనో, రమ్య బెహరా సూపర్ ఎనర్జిటిక్‌గా పాడారు . రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాలకృష్ణ పాత్ర గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ పాటలో బాలకృష్ణ లైవ్లీగా, గ్రేస్‌ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశారు. శృతి హాసన్, బాలకృష్ణ గ్రేస్ కు తగ్గట్టుగా గ్లామరస్ గా కనిపించింది.

వైబ్రెంట్ సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. విజువల్స్ కలర్‌ఫుల్‌గా కనిపించాయి. ఆఖరి విజువల్స్ లో పవన్ కళ్యాణ్ సెట్ లోకి రావడం కనిపించింది. గోపీచంద్ మలినేనికి వీరసింహా రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్‌తో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

గ్రాండ్ గా జరిగిన మాస్ మొగుడు సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి సెన్సార్ ఈ రోజు పూర్తయ్యింది. సెన్సార్ తర్వాత బ్లాక్ బస్టర్ అని కాల్స్ వచ్చేస్తున్నాయి. చాలా ఆనందంగా వుంది. ఒంగోలు ఈవెంట్ లో రిలీజ్ చేసిన థియేటర్ ట్రైలర్ కి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది బాలయ్య బాబు మాస్ లా వుంటుందో జస్ట్ సాంపిల్ మాత్రమే సినిమాలో మాములుగా వుండదు. వీరసింహారెడ్డి ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. రాసిపెట్టుకోండి. థియేటర్స్ అన్నీ ఒక వైబ్రేషన్ తో వుంటాయి. తమన్ ఎక్స్ ట్రార్డినరీ సాంగ్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి సినిమాని రెండోసారి చూస్తారు. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. ఇప్పుడు విన్న పాటలే కాకుండా బ్యాగ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ రెడీ వున్నాయి. అవి ఇంకా ఎక్స్ ట్రార్డినరీ గా వుంటాయి. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి రాశారు.

ఇవి కూడా చదవండి

మాస్ మొగుడు చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమరామెన్ రిషి పంజాబీ డిఐ వర్క్ లో వుండటం వలన నా క్రాక్ సినిమా కెమరామెన్ జికె విష్ణు ఈ పాటని చేశారు. చాలా కలర్ ఫుల్ గా బాలయ్య బాబుని చాలా అందంగా చూపించాడు. రన్ టైం లో ఈ పాట వచ్చినపుడు మాములుగా వుండదు. ఈ సినిమాకి చాలా సక్సెస్ మీట్లు వుంటాయి. పండక్కి రాబోతున్న రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించాలని మెగాస్టార్ చిరంజీవి గారు మనస్పూర్తిగా కోరుకున్నారు. చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వీరసింహా రెడ్డిలానే వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అన్నీ మా సినిమాలే. అన్ని సినిమాలు బావుండాలి. ఈ పండగ నెక్స్ట్ లెవల్ లో వుండాలి’’ అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
వామ్మో.. హైబీపీతో గుండెకే కాదు.. దానికి కూడా పెను ప్రమాదమట..
వామ్మో.. హైబీపీతో గుండెకే కాదు.. దానికి కూడా పెను ప్రమాదమట..
ఐపీఎల్ 2024 విజేతపై కాసుల వర్షం.. ట్రోఫీతోపాటు ఎంత దక్కనుందంటే
ఐపీఎల్ 2024 విజేతపై కాసుల వర్షం.. ట్రోఫీతోపాటు ఎంత దక్కనుందంటే
ఊర్వశీ రౌతేలా రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..
ఊర్వశీ రౌతేలా రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..
ఏపీలో కొత్త గుబులు.. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది..?
ఏపీలో కొత్త గుబులు.. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది..?
కోహ్లీ మిస్సింగ్.. టీమిండియాతో కలిసి వెళ్లని రన్ మాస్టర్
కోహ్లీ మిస్సింగ్.. టీమిండియాతో కలిసి వెళ్లని రన్ మాస్టర్
పుష్పగాడి రూలా ఏందీ? school వాట్సాప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్!
పుష్పగాడి రూలా ఏందీ? school వాట్సాప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్!
మాయ చేస్తున్న కేటుగాళ్లు.. సగం సిలిండర్లు ఇక్కడే రీఫిల్లింగ్..!
మాయ చేస్తున్న కేటుగాళ్లు.. సగం సిలిండర్లు ఇక్కడే రీఫిల్లింగ్..!
ఆడు మనిషి కాదు.. మాన్‌స్టర్.. బరిలోకి దిగితే ప్రత్యర్ధులకు హడలే
ఆడు మనిషి కాదు.. మాన్‌స్టర్.. బరిలోకి దిగితే ప్రత్యర్ధులకు హడలే
రాజకీయ వివాదంగా మారిన కరీంనగర్‌ శోభాయాత్ర.. ఆరుగురిపై కేసు
రాజకీయ వివాదంగా మారిన కరీంనగర్‌ శోభాయాత్ర.. ఆరుగురిపై కేసు
అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. సినిమాను తలపించేలా గ్యాంగ్‌ వార్‌
అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. సినిమాను తలపించేలా గ్యాంగ్‌ వార్‌