AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: అత్యాచార ఘటనలపై ఆర్జీవీ సెన్సెషనల్ కామెంట్స్.. వాళ్లు రాక్షసులుగా ఎందుకు మారారో తెలుసుకోరా అంటూ..

రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనల ఆధారంగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే సంఘంలో

Ram Gopal Varma: అత్యాచార ఘటనలపై ఆర్జీవీ సెన్సెషనల్ కామెంట్స్.. వాళ్లు రాక్షసులుగా ఎందుకు మారారో తెలుసుకోరా అంటూ..
Rgv
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2021 | 6:11 PM

Share

రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనల ఆధారంగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే సంఘంలో పలువురు ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలా వాస్తవిక సంఘటన దిశ ఘటన ఆధారంగా కల్పిత కథతో వస్తున్న ఈ సినిమా ఆశ: ఎన్ కౌంటర్. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా. అనురాగ్ కంచర్ల నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా షూటింగ్‏తోపాటు అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు ఆర్జీవి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ఈ సినిమా దిశ సంఘటన మాత్రమే కాదని.. దేశంలో జరిగిన అన్ని ఘటనల ఆధారంగా కలబోత అని అన్నారు. “ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం కావొచ్చు. హైదరాబాద్‏లో జరిగిన దిశ ఘటన కావొచ్చు. దేశంలో ఎప్పుడూ ప్రతిచోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఆ ఘటనలన్నింటినీ సినిమాల చూపించాం. ప్రత్యేకంగా ఓ అమ్మాయి మీద జరిగిన ఘటన మాత్రమే కాదు. ఇప్పటివరకు జరిగిన ఘటనలలో ఓ కామన్ పాయింట్ ఉంటుందని.. ఒంటరిగా అమ్మాయి కనిపించగానే గ్యాంగ్‏లు ప్లాన్ చేసి ఆత్యాచారలకు పాల్పడుతుంటాయి.. ఎన్ని చట్టాలు తెచ్చిన దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఘటనకు ముందు నిందితులంతా అందరిలాగే మామూలు మనుషులు… వారి మీద ఎలాంటి నేర చరిత్ర కూడా ఉండదు.. కానీ ఘటన జరిగిన రోజు క్షణాల్లో వాళ్లంతా రాక్షసుల్లాగా మారిపోతున్నారు. అసలు వాళ్లకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ?. అప్పటిదాకా బాగున్నవారు అలా రాక్షసులుగా ఎలా మారారు ? అనేది తెలుసుకోకుండా.. వారిని కాల్చి చంపేస్తే అది పోలీస్ స్టేట్ అయిపోదా?” అంటూ ప్రశ్నించారు ఆర్జీవి.

ఈ సినిమా స్టోరీ గురించి చాలా మంది పోలీసులతో మాట్లాడానని.. వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నాకే సినిమా తీశామన్నారు ఆర్జీవీ. సినిమా కథలకు కొన్ని పరిధులు పెట్టుకున్న తర్వాత డైరెక్టర్ ఆ పరిధి దాటి వెళ్లలేడని.. అలాంటప్పుడు ఆ కథను తాను తీసినా, వేరే డైరెక్టర్ తీసినా పెద్దగా మార్పు ఉండదన్నారు. సినిమాలో ఆత్యాచారం ఎపిసోడ్ 45 నిమిషాలు ఉంటుందని.. ఆ తర్వాత ఆమెను చంపి, శవాన్ని మాయం చేయడం.. నిందితులను ఎన్ కౌంటర్ చేయడం వంటి సన్నివేశాలుంటాయన్నారు. ఆశ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద్ చంద్ర మంచి ప్రతిభ ఉన్నవాడని.. అందుకే సినిమా బాధ్యతలు అప్పగించాను అని అన్నారు.

Also Read: Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!